Modi Live : ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం.. అమరావతి పునర్నిర్మాణం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో.. కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో.. ఈ పర్యటనపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఎయిర్ పోర్టు నుంచి ఓపెన్ టాప్ జీపులో ప్రధాని మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ రోడ్‌షో ప్రారంభమైంది. వీరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ.. ఏయూలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే.. సభా ప్రాంగణంలో వేల మంది ప్రజలు.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సభా వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.