BigTV English

Posani Krishna Murali: ఎట్టకేలకు పోసానికి బెయిల్.. ఈసారైనా మోక్షం కలిగేనా?

Posani Krishna Murali: ఎట్టకేలకు పోసానికి బెయిల్.. ఈసారైనా మోక్షం కలిగేనా?

Posani Krishna Murali: మాజీ వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ ఉదయం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్‌ మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదనే నిబంధనలతో పోసానికి బెయిల్‌ ఇచ్చింది. వారానికి రెండు సార్లు సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశించింది.


శుక్రవారం నాడు కోర్టు బెయిల్ ఇచ్చినా.. జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల కాలేదు. పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ పేపర్లు రావడం లేట్ అవడంతో.. విడుదల ఆలస్యం అయిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు, లక్ష చొప్పున షూరిటీ ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. నేడు బ్యాంక్‌లకు సెలవు ఉండటంతో షూరిటీ బాండ్స్ ఆలస్యం అయ్యే చాన్స్ ఉంది. పోసాని విడుదల విషయంలో వైసీపీ అనుమానాల వ్యక్తం చేస్తోంది. ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉందని పోసాని తరపు న్యాయవాదులు అభిప్రాయపడుతుంటే.. ఏ క్షణంలో పీటీ వారెంట్‌తో ఏ స్టేషన్ పోలీసులు వస్తారో అని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి కేసులు లేవని న్యాయవాదులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 26వ తేదీన పోసానిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఏపీలో ఆయనపై 19 కేసులు నమోదయ్యాయి. బెయిల్ మంజూరు కావడంతో పోసాని జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.


పోసానిని ఇప్పటి వరకు అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సీఐడీ పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. ఒకరోజు సీఐడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది.

Also Read: తప్పిస్తాడా.. లైట్ తీసుకుంటాడా.. శ్యామలపై జగన్ నిర్ణయం ఏంటి?

పోసాని కృష్ణమురళి అంటే.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు, మాటలు అందించిన రైటర్. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కూడా. ఎన్నో ఏళ్లుగా.. ఎంతో కష్టపడి.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గౌరవం సంపాదించుకున్న పోసాని.. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏం చేస్తామో.. అదే మనకు తిరిగొస్తుంది అని చెప్పడానికి ఇదే.. సింపుల్ ఎగ్జాంపుల్.

ఏదేమైనా.. రాజకీయ నాయకులు, పార్టీల మద్దతుదారులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా వాళ్ల టైమ్ కొన్నాళ్లే నడుస్తుంది. అవతలి వాళ్ల టైమ్ వచ్చినప్పుడు.. వాళ్లూ ఎంతో కొంత పవర్ వాడతారు. అప్పుడు.. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకోసమే.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకూడదు. ఇది.. అందరికీ వర్తిస్తుంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×