Hangover Prevention Tips| స్నేహితులతో రాత్రంతా సందడి చేసుకోవడం, మ్యూజిక్ ఆస్వాదిస్తూ.. జీవితాన్ని ఉత్సాహంగా గడపడం అందరికీ ఇష్టమే. కానీ, ఈ ఆనందం తర్వాత డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు రావచ్చు. సరైన ఆహారం, నీరు బాగా తాగడం వంటి కొన్ని సులభ చిట్కాలతో మీరు మరుసటి రోజు ఉత్సాహంగా మేల్కొనవచ్చు. హిమాలయా వెల్‌నెస్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పుష్ప లత, పార్టీస్మార్ట్‌పై పరిశోధనలు చేసి.. హ్యాంగోవర్ నివారణకు కొన్ని చిట్కాలు సూచించారు.
పార్టీకి ముందు సమతుల ఆహారం
ఖాళీ కడుపుతో పార్టీకి వెళ్లడం మంచిది కాదు. పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వికారం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
చపాతీ, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి పిండి పదార్థాలు శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి.
గుడ్డు, గ్రిల్డ్ చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి.
ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి ఆరోగ్యకర కొవ్వులు మద్యం రక్తంలోకి త్వరగా చేరకుండా అడ్డుకుంటాయి.
నీటిని ఎక్కువగా తాగండి
పార్టీలో ఉత్సాహంలో నీరు తాగడం మర్చిపోతాం. ఒక్కో మద్యం గ్లాసుకు ఒక గ్లాసు నీరు తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. కొబ్బరి నీరు, తక్కువ చక్కెర ఉన్న స్పోర్ట్స్ డ్రింక్స్ తాగితే పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు తిరిగి శరీరానికి అందుతాయి.
మూలికల సహాయంతో హ్యాంగోవర్ నివారణ
పార్టీకి ముందు మూలికలతో తయారైన యాంటీ-హ్యాంగోవర్ ఉత్పత్తి తీసుకోవడం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా మేల్కొంటారు. ఇందులో ఉండే పదార్థాలు:
చికోరీ, ఖర్జూరం కాలేయ శుద్ధికి సహాయపడతాయి.
కల్మేఘ్ (ఆండ్రోగ్రాఫిస్ పానికులాటా) యాంటీ ఇన్‌ఫ్లమెటరీ ప్రయోజనాలు అందిస్తుంది.
ద్రాక్ష (విటిస్ వినిఫెరా) యాంటీఆక్సిడెంట్‌లతో శరీరాన్ని రక్షిస్తుంది.
డ్రింక్స్ ఎంచుకోవడంలో జాగ్రత్త
మద్యం రకం, కాక్‌టెయిల్స్ ఎంచుకోవడంలో జాగ్రత్త వహించండి. చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్ రక్తంలో చక్కెర స్థాయిని అస్థిరం చేసి తలనొప్పి, అలసటను పెంచుతాయి. ఒకే రకం మద్యం తాగడం మంచిది, విభిన్న డ్రింక్స్ కలపకండి.
Also Read: వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి
మరుసటి రోజు రికవరీ చిట్కాలు
మరుసటి రోజు ఎలా ప్రారంభిస్తే రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ సులభ చిట్కాలు పాటించండి:
ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి జీర్ణక్రియను ప్రారంభిస్తుంది.
పాలకూరతో కూడిన ఆమ్లెట్, లేదా పెరుగు, పండ్లతో తయారైన స్మూతీ వంటి ఆరోగ్యకర అల్పాహారం తీసుకోండి.
తేలికపాటి వ్యాయామం, యోగా లేదా నడక మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, రక్త ప్రసరణను పెంచుతాయి.
ఈ చిట్కాలను.. సరైన హైడ్రేషన్, మూలికల సహాయంతో కలిపి పాటిస్తే, మీరు పార్టీని హాయిగా ఆస్వాదించి, మరుసటి రోజు ఉత్సాహంగా మేల్కొనవచ్చు.