Pulivendula: పాలకులు సరైనవాళ్లు ఉంటే రాజ్యం గానీ, రాష్ట్రంగానీ హ్యాపీ ఉంటుంది. ఈ విషయం చెప్పడానికి పులివెందులకు చెందిన కనిపిస్తున్న రైతు ఓ ఎగ్జాంపుల్. ఇంతకీ ఆ రైతు చేసిందేమిటి? ప్రభుత్వం ఎలాంటి సహాయసహకారాలు అందించింది? ఆ రైతు ఆనందం వెనుక ఇంకాస్త లోతుల్లోకి వెళ్లొద్దాం.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను గాడిలో పెడుతూ వస్తోంది. ఇప్పటికి కొన్ని సెక్టార్లను దారికి తెచ్చింది. మరికొన్నింటిపై ఫోకస్ చేసింది. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు. అందుకే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే అగ్రికల్చర్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
ఇక అసలు విషయానికొద్దాం.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రకరకాల సబ్సిడీలు ఇస్తోంది. అందులో వ్యవసాయం చేసేందుకు పరికరాలు కీలకమైనవి. రైతే రాజు అన్న నినాదంతో ముందుకెళ్తోంది. గత వైసీపీ హయాంలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి ఎలాంటి పరికరాలు ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడ్డామన్నది రైతుల మాట.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ రైతుకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు వచ్చాయి. దీంతో యువ రైతు ఆనందానికి హద్దులేకుండా పోతోంది. డ్రిప్ ఇరిగేషన్ కోసం విష్ణు వర్ధన్‌రెడ్డి రైతు కొనుగోలు చేసిన పరికరాల మొత్తం రూ.2.69 లక్షలు.
ALSO READ: రుషికొండ బీచ్‌కు షాక్
తాను కేవలం రూ.27 వేలు మాత్రమే చెల్లించానంటూ బిల్లు చూపించాడు. రెండు లక్షల నలభై వేల రూపాయల సబ్సిడీ రూపంలో ప్రయోజనం చేకూరిందన్నాడు. వచ్చిన పరికరాలు చూపిస్తూ కూటమి ప్రభుత్వానికి తన ధన్యవాదాలు తెలిపాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు 90 శాతం డ్రిప్ సబ్సిడీ వచ్చిందని పులివెందుల రైతు హర్షం వ్యక్తం చేశాడు.
90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి పరికరాలు రావడంతో రైతు ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కి పులివెందుల రైతు ధన్యవాదాలు తెలిపాడు. గడిచిన ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, దాని ఆధారిత నాశనం అయ్యాయని కూటమి ఆరోపిస్తోంది.దీనివల్ల దిగుబడి తగ్గిందని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. పులివెందుల యువ రైతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు విజన్ అంటే ఇదేనని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. బిందు సేద్యం వంటి సుస్థిరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టారన్నారు. వృద్ధి, స్వావలంబన ప్రధాన దశకు చేరుకునే భవిష్యత్తు కోసం పని చేస్తూనే ఉంటామన్నారు.
This is exactly what @ncbn garu’s vision is all about—transforming governance to uplift lives through sustainable and impactful initiatives like drip irrigation. We will continue working towards a future where growth and self-reliance take center stage! #IdhiManchiPrabhutvam… https://t.co/eX1XvWZIya
— Lokesh Nara (@naralokesh) March 2, 2025