Big Stories

Andhra Pradesh : ఏపీలో అంతా ‘రెడీ’యేనా.. వన్.. టూ.. త్రీ.. ఇక పరుగెత్తండి..

Andhra Pradesh election news

Andhra Pradesh election news(AP political news):

అది 2019వ సంవత్సరం
ఏప్రిల్ 11వ తేదీ
ఆరోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్ సభకు పోలింగ్ జరిగింది.

- Advertisement -

ఇప్పుడు 2023వ సంవత్సరం,
ఐదేళ్ల గడువు తీరడానికి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఇదిలా ఉండగానే  ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ఎలక్టోరల్‌ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. దీంతో ఎన్నికల సందడి ఇక్కడ కూడా ఆల్రడీ మొదలైపోయిందనే చెప్పాలి.

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో వారంరోజుల్లో హంగామా అంతా ముగిసిపోనుంది. తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది.  ఆ తర్వాత లైన్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. మరో మాటలో చెప్పాలంటే లోక్ సభ ఎన్నికలకు కూడా సమయం ఆసన్నమైందనే చెప్పాలి. నాడు రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో 2024 స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ రూపకల్పన తనిఖీ కోసం అయిదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లను అబ్జర్వర్లుగా నియమిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆకస్మిక ఆదేశాలతోనే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పకనే చెప్పినట్టయ్యింది.

ఎవరూ కూడా లోక్ సభ ఎన్నికలపై నోరు విప్పడం లేదు. అంతా ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికలపై, దీంతో పాటు ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇవి వచ్చే లోక్ సభ ఎన్నికలకు రిఫరెండం అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో వేడి అలా చల్లారగానే, ఏపీలో సెగ ఇలా మొదలయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి, ఏపీలో కూడా రాజకీయ సమీకరణాలు మారేలా కనిపిస్తున్నాయి. అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు జె. శ్యామల రావు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు బి.శ్రీధర్, గోదావరి సెక్టార్‌లో ఎన్.యువరాజ్‌, దక్షిణ కోస్తా జిల్లాల్లో పోలా భాస్కర్‌, సీమ జిల్లాలకు డి.మురళీధర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీళ్లందరూ వారికి కేటాయించిన జిల్లాల్లో జనవరి 4లోగా మూడుసార్లు పర్యటిస్తారు. 

ఓటర్ల జాబితా పూర్తయ్యేలోగా ఈ పర్యటనలు ముగుస్తాయి. తొలిసారి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. ఓటరు జాబితా రూపకల్పనలో ఫిర్యాదులు, అభ్యంతరాలు తీసుకుంటారు. సాధారణ ప్రజలు కూడా రోల్ అబ్జర్వర్లను కలిసి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News