Vishaka News: దేశంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం అజాగ్రత్త అని చెప్పవచ్చు. LPG గ్యాస్ అత్యంత మండే వాయువు. అందుకే ఇంట్లో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెబుతున్నప్పటికీ చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.
విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. నగరంలోని ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఓ మహిళ తలకి తీవ్ర గాయమైంది. ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరుగురు ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
ALSO READ: Trivikram Srinivas: సీరియస్ టాపిక్ లో కూడా త్రివిక్రమ్ పంచ్
భారీ పేలుడు సంభవించడంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున గోడలు కూలడంతో భయాందోళనకు గురయ్యామని పేర్కొన్నారు.