Trivikram Srinivas : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక రచయితగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి సినిమాకి వెళ్లే ఆడియన్స్ కూడా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. రచయితగా వరుస హిట్ సినిమాలు అందుకుంటున్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారారు. ఆ సినిమా తర్వాత కొన్నేళ్లపాటు దాదాపు కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కలిసి పని చేశారు. ఇద్దరు యంగ్ హీరోస్ తప్ప ఇప్పటివరకు శ్రీనివాస్ కేవలం స్టార్ హీరోలతోనే పనిచేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించిన మరో అప్డేట్ కూడా జనవరి 2025లో ఇవ్వనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. త్రివిక్రమ్ తన కెరీర్ లో మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.
ఇకపోతే రీసెంట్ గా పుష్ప 2 మంచి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. డిసెంబర్ 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ఈ సినిమాను చూడడానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు వచ్చారు. అక్కడ ఒకసారిగా తొక్కేసినట్టు జరగడంతో రేవతి అనే మహిళ మరణించారు. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు నిమిత్తం అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చే పలకరించడంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. దీనికి సంబంధించి, అలానే చాలా సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలు మాట్లాడటం కోసం నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్స్ ఇకపై తెలంగాణలో ఉండవు అని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలను అనర్గళంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ అంశాల పైన దిల్ రాజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఈ ప్రాసెస్ అంతటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కొంతమంది మీడియా చుట్టుముట్టి కొన్ని ప్రశ్నలు వేశారు. త్రివిక్రమ్ కి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ పరిణామాలు అన్నిటి గురించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడిగితే త్రివిక్రమ్ చాలా సింపుల్ గా థాంక్యూ అని చెప్పేసాడు. అంతేకాకుండా దర్శకులకు ఏం కష్టాలు ఉంటాయండి అంటూ నవ్వుతూ మీడియాను అవైడ్ చేశాడు త్రివిక్రమ్.
Also Read : Anaganaga Oka Raju Movie : ప్రాజెక్ట్ లేట్ అయితే ఇద్దరు మారిపోయారు