BigTV English
Advertisement

A Doctor suicide: డాక్టర్ ఆత్మహత్య, భర్తతో గొడవ, ఏమైంది?

A Doctor suicide: డాక్టర్ ఆత్మహత్య, భర్తతో గొడవ, ఏమైంది?

A Doctor suicide: శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. మరి ఏమైందో తెలీదుగానీ అర్ధరాత్రి భర్తతో గొడవపడ్డారు డాక్టర్ అశ్విని. తెల్లవారేసరికి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్దాం.


శ్రీకాళహస్తి టౌన్‌లోని కొత్తపేటలో ఉంటున్నారు డాక్టర్ అశ్విని. ఆమె వయస్సు 35 ఏళ్లు. ఎనిమిదేళ్ల కిందట వ్యాపారవేత్త సీతారామరెడ్డి కొడుకు రాజేష్‌తో వివాహం జరిగింది. స్థానికంగా ఓ క్లినిక్ కూడా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు చదువుకున్న వాళ్లు కావడంతో కాపురం అంతా సజావుగా సాగుతోంది. పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉండేది. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవులు ఎప్పుటి నుంచి జరుగుతున్నాయో తెలీదుగానీ, రాత్రి టిఫిన్ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

భార్యాభర్తల మధ్య మాటలు హద్దులు దాటాయి. మెల్లగా గొడవకు ఫుల్‌స్టాప్ పడింది. అశ్విని తన రూమ్‌కి వెళ్లిపోయారు. తెల్లవారేసరికి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ఉదయం ఆమె కూతురు తలుపు ఎంత కొట్టినా తీయలేదు. చివరకు ఫ్యామిలీ సభ్యులకు చెప్పింది. ఈలోగా కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. అశ్వినిని విగతజీవిగా ఉండడాన్ని చూసి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి పరిశీలించారు.


ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించిన కొన్ని పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. అశ్విని భర్త రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అశ్విని డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Tags

Related News

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Jagan Tweet: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు

TDP Politics: కొందరు నేతలపై మంత్రి లోకేష్ సీరియస్.. ఏం జరిగింది? మళ్లీ వచ్చేసరికి

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Ap Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త.. కేవలం 20 రోజులే, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×