BigTV English

AMB in Bangalore: బెంగుళూరులో మహేష్ కొత్త అడుగు.. వాళ్లు నెగ్గనిస్తారా..?

AMB in Bangalore: బెంగుళూరులో మహేష్ కొత్త అడుగు.. వాళ్లు నెగ్గనిస్తారా..?

Mahesh Babu Starts AMB Cinema’s in Bangalore: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద స్టార్ నో.. అంతే బిజినెస్ మ్యాన్ కూడా. మొదటి నుంచి కూడా మహేష్ ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడడు. సినిమాలు.. లేకపోతే యాడ్స్.. ఇవి లేకపోతే బిజినెస్ లు ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఘట్టమనేని కుటుంబం మల్టీఫ్లెక్స్ బిజినెస్ లోకి దిగి విజయవంతం అయిన విషయం తెల్సిందే.


హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB మల్టీఫ్లెక్స్ నిర్మించిన మొదటి హీరో మహేష్ నే. దీని తరువాత చాలామంది స్టార్ హారాలు తమ వెంచర్స్ ను మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు మహేష్.. తన మల్టీఫ్లెక్స్ బిజినెస్ ను దేశం అంతా విస్తరించాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే మొదటి అడుగుగా బెంగుళూరులో AMB మాల్ ను ప్రారంభించడానికి పనులు మొదలయ్యాయి. నిన్ననే బెంగుళూరులో ఏషియన్ సునీల్ నారంగ్.. పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read: Tomorrow OTT Movies: రేపు ఓటీటీలో సినిమాల జాతర.. టిల్లు స్క్వేర్‌తో సహా మరికొన్ని సినిమాలు..


ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన మహేష్ బాబు.. AMB తన కొత్త అడుగును బెంగుళూరులో వేయడానికి సిద్ధంగా ఉంది.. అల్ ది బెస్ట్ టీమ్ అంటూ రాసుకొచ్చాడు. ఇక బెంగుళూరు లో ప్రస్తుతం PVR మల్టీఫ్లెక్స్ చైన్ నడుస్తోంది. ఎప్పటినుంచో బెంగుళూరులో PVR పాతుకుపోయింది. ఇప్పుడు కొత్త మల్టీఫ్లెక్స్ అంటే వాళ్లు నెగ్గనిస్తారా.. ? అన్ని దాటుకొని మహేష్ అక్కడ కూడా విజయాలను అందుకుంటాడా.. ? అనేది చూడాలి. ఇకపోతే ప్రస్తుతం మహేష్ ssmb29 తో బిజీగా ఉన్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×