BigTV English

Crime: మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరింపులు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Crime: మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరింపులు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Crime: మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి మహిళలను వేధిస్తున్నారు. విజయవాడలో ఓ కేటుగాడు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. బెదిరించి ఆమె నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. మహిళ తిరిగి ఇవ్వాలని అడగడంతో.. ఆమెను చితకబాదాడు.


రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శాంతి నగర్‌లో కిరాణా షాపు నడుపూ జీవనం సాగిస్తుంది. అదే కాలనీకి చెందిన పుట్టా సుభాష్ అనే వ్యక్తి పలుమార్లు సరుకుల కోసం వారి దుకాణానికి వెళ్లాడు. సరుకుల డబ్బులను ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా పంపించి ఆమె నెంబర్‌ను సంపాదించాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత.. ఆమె ఇంటి దగ్గర స్నానం చేస్తుంది చూసి.. ఫొటోలు, వీడియోలు తీశాడు.

వాటిని ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తాను చెప్పినట్లు వినాలని.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. ఆపై పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఏడాది పాటు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే ఆమె దగ్గరి నుంచి రూ. 16 లక్షలు తీసుకున్నాడు. ఇటీవల మహిళ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో.. ఆమెపై దాడి చేసి చితకబాదాడు. డబ్బులు తిరిగి ఇవ్వనని తేల్చిచెప్పాడు.


ఈక్రమంలో చేసేది ఏమీ లేక.. అతని వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుభాష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×