E-Paper
Advertisement

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Amaravati: ప్రతీది మొబైల్‌కు లింక్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా రేషన్‌కార్డు దారులకు ముఖ్యమైన సూచన. రేషన్‌ కార్డులున్నవారు తమ మొబైల్ నెంబర్ లింక్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతున్నారు. ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. అసలు ఏం జరుగుతోంది.

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్

కేంద్రం ఇటీవల భారీగా రేషన్ కార్డులను తొలగించాలని డిసైడ్ అయ్యింది. రేషన్ కార్డు ఉన్నా చాలామంది రేషన్ తీసుకోలేదు. అలాంటివారి కార్డులను తాత్కాలికంగా నిలిపి వేసేందుకు రెడీ అవుతోంది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారు దాదాపు కోటిన్నర మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతోంది. దీన్ని ముందుగా గమనించిన ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రేషన్ పంపిణీలో అక్రమాలకు అవకాశం లేకుండా స్మార్ట్ కార్డు తీసుకొచ్చింది. కార్డులు ఉన్నవారు ప్రతి నెలా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ప్రతీనెలా సరుకులు తీసుకుంటున్నారు. మరికొందరు మూడు నెలలకు ఒకసారి సరుకులు తీసుకుంటున్నారు. కొంతమంది లబ్ధిదారులు నెలల తరబడి సరుకులు తీసుకోలేదని గుర్తించారు అధికారులు.

రేషన్ కార్డుకు మొబైల్ లింక్ చేయాలని ఆదేశాలు

Advertisement

ఏపీలో రేషన్‌కార్డుకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినవారికి సరుకులు ఇస్తున్నారు అధికారులు. దాదాపు 90 శాతం ఈ-కేవైసీ పూర్తి అయ్యింది. రేషన్‌ కార్డుదారుడు తమ మొబైల్ నంబర్ అనుసంధానం చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డుకు వారి మొబైల్ నంబర్లను లింక్ చేయలేదు. మొబైల్ నంబర్ లింకుపై డీలర్లు.. కార్డుదారులకు అవగాహన కల్పించి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు పౌరసరఫరాలశాఖ అధికారులు. ఇదేమీ అంత పెద్ద విషయం కాదని, రేషన్ డీలర్ల దగ్గరకు వెళితే మొబైల్ నంబర్లను లింక్ చేస్తారని అంటున్నారు.

ALSO READ: దాదాపు రెండు గంటలపాటు భేటీ.. ఒత్తిడిలో పెద్దాయన, బాబు ఏం చెప్పారు?

Advertisement

రేషన్‌కార్డులు ఉన్నవారికి బియ్యంతోపాటు కొన్ని సరుకుల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ప్రతి నెలా ఒకటి నుంచి 15 వరకు సరుకులు అందిస్తారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో రైతు బజార్ల ద్వారా బియ్యం, ఉల్లి పాయలను రాయితీపై అందిస్తుంది. రేషన్ కార్డులు ఉన్నవారికి వీటిని ఇస్తున్నారు. మిగిలిన వారు ఆధార్ కార్డు చూపించి రుకులు తీసుకునే అవకాశం కల్పించారు. త్వరలో పామాయిల్, కందిపప్పును రాయితీపై అందిస్తామని తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది. వృద్ధుల మాట ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారికి మొబైల్ గురించి తెలీయదని, అలాంటి వాళ్లు ఈ పద్దతి వల్ల ఇబ్బంది పడతారని అంటున్నారు.

Related News

కూటమి ప్రభుత్వానికి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, హైకోర్టు సమర్థించిన సుప్రీంకోర్టు

దాదాపు రెండు గంటలపాటు భేటీ.. ఒత్తిడిలో పెద్దాయన, బాబు ఏం చెప్పారు?

దసరా వేళ ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. పట్టణాలకు ఆ విధంగా, గ్రామాలకు మరొకలా..

ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ

తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

Big Stories

Advertisement
×