BigTV English

Visakha: విశాఖలో పాక్ ఫ్యామిలీకి రిలీఫ్.. మళ్లీ నోటీసు

Visakha: విశాఖలో పాక్ ఫ్యామిలీకి రిలీఫ్.. మళ్లీ నోటీసు

Visakha: వైద్యం కోసం విశాఖ వచ్చిన పాకిస్తాన్‌కి చెందిన ఓ ఫ్యామిలీకి స్వల్ప ఊరట లభించింది. వారి సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత అధికారులు కాస్త రిలీఫ్ ఇచ్చారు. ఒకవేళ ఏమైనా నోటీసులు వస్తే మాత్రం వెళ్లాల్సి ఉంటుందని చెప్పేశారు. అసలేం జరిగింది? ఎలా రిలీఫ్ దక్కింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ జాతీయులు భారత్ విడి వెళ్లాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మోదీ సర్కార్ ఇచ్చిన గడువు మంగళవారం(ఏప్రిల్ 29)తో ముగిసింది. ఇండియా నుంచి దాదాపుగా అందరూ వెళ్లిపోయారు. కాకపోతే ఓ ఫ్యామిలీకి మాత్రం ఇండియాలో ఉండే అవకాశం వచ్చింది.

పాక్ ఫ్యామిలీకి ఊరట


విశాఖకు చెందిన ఓ పాకిస్థాన్‌కు చెందిన ఫ్యామిలీ రెండురోజుల కిందట సిటీ పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీతో సమావేశమైంది. ఆ సమయంలో తమ వద్దనున్న మెడికల్ రిపోర్టు చూపించింది. తమ సమస్యను వివరించింది.  మానవతా దృక్పథంతో ఆలోచించాలని వేడుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. ఆపై హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

పాకిస్థానీ ఫ్యామిలీ విశాఖలో ఉండేందుకు మౌఖిక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని సీపీ శఖబ్రత బాగ్చీ వెల్లడించారు. మరో నోటీసు వచ్చేవరకు విశాఖలో ఉండేందుకు అనుమతి వచ్చిందన్నారు. దీంతో ఆ ఫ్యామిలీలో ఆనందం అంతా ఇంతా కాదు. ఏ దేవుడో తమను కాపాడాడని అంటున్నారు. ఈ మేలు జన్మలో మరిచిపోలేమన్నది ఆ కుటుంబసభ్యుల మాట.

ALSO READ: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్

అసలు కథేంటి?
విశాఖ సిటీలో ఓ పాకిస్తాన్ ఫ్యామిలీ ఉంటోంది. అయితే ఆ ఫ్యామిలీలో మహిళ భర్త, ఆమె పెద్ద కొడుకు పాకిస్థాన్ పౌరసత్వం ఉంది. ఆమె, చిన్న కొడుకుకి భారత్ పౌరసత్వం ఉంది. పెద్ద కొడుకు అనారోగ్యం బారినపడ్డాడు. విశాఖలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ వెళ్లలేక విశాఖలో ఉంటూ దీర్ఘకాలం వీసాకు గతేడాది దరఖాస్తు చేసింది ఆ ఫ్యామిలీ.  ప్రస్తుతం ఆ అంశం పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది. పాక్ జాతీయులు ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఉండటానికి వీల్లేదని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆదేశాలు ఇచ్చింది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రులతో స్వయంగా మాట్లాడారు. వీసా కేటగిరిలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. సార్క్ వీసా కింద 12 వర్గాలు వారు ఉన్నారు. లాంగ్ టర్న్ వీసా కింద వచ్చినవారు రెండోది. మూడోది వైద్య వీసా వచ్చినవారు మూడో కేటగిరి. మంగళవారంతో వైద్య వీసా కింద ఇచ్చినవారి గడువు అయిపోయింది.  అయితే విశాఖలో ఫ్యామిలీకి మాత్రమే రిలీఫ్ ఇచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×