Rajahmundry Airport: రాజమండ్రి విమానశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త టర్మినల్ నిర్మాణ పనుల్లో టెర్మినల్ భాగం కిందపడడంతో ప్రమాదం జరిగింది. అయితే విమానాశ్రయ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
వివరాల ప్రకారం. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం కుప్పకూలింది. పనులు జరుగుతుంటూనే ప్రమాదం జరిగింది. కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.