Amaravati national highway: పల్నాడు నుంచి అమరావతికి ఇక బస్సు కాదు, బుల్లెట్ స్పీడ్ ప్రయాణం. రూ. 881 కోట్లతో పెరచెర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు లైన్ జాతీయ రహదారి మంజూరు కావడంతో.. అమరావతి మార్గం మరింత వేగవంతం కానుంది. అమరావతి ORR కు లింక్ రోడ్ కూడా ప్రతిపాదించడంతో, హైదరాబాద్ నుంచైనా, గుంటూరు నుంచైనా.. అమరావతికి చేరడం ఇక యమ స్పీడ్ గా మారబోతోంది.
ఆ జిల్లా ప్రజలకు ఇది శుభవార్తే!
పల్నాడు, గుంటూరు, హైదరాబాద్ ప్రజలకు ఇది నిజమైన శుభవార్తే. అమరావతిని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 881.61 కోట్లతో కొత్త నాలుగు లైన్ల జాతీయ రహదారికి ఆమోదం లభించింది. ఈ రహదారి పెరచెర్ల నుంచి కొండమోడు వరకు విస్తరించనుంది. ఈ రూట్ మొత్తం జాతీయ రహదారి (NH) పరిధిలో ఉండబోతున్నది.
ఏంటా రహదారి ప్రాధాన్యత?
ఇంతకీ దీని ప్రాధాన్యత ఏమిటంటే ఈ కొత్త హైవేలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) కు కూడా 3 కిలోమీటర్ల లింక్ రోడ్ ప్రతిపాదనలో ఉంది. అంటే ఇప్పుడు పల్నాడు నుంచి అమరావతికి వెళ్లాలంటే నాలుగు మార్గాలు ఇక గాలిలో కలిసిపోతాయి. ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పాటు, ప్రయాణ సమయం కూడా కాస్తే కాదు, గంటల తరబడి తగ్గే అవకాశముంది.
Also Read: Hari Hara Veeramallu : వీరమల్లుకు చార్మినార్‌కు ఏం సంబంధం… యోధుడి కథను వక్రీకరిస్తున్నారా ?
ఇక అంతా స్పీడ్ మయం
ప్రస్తుతం గుంటూరు నుంచి అమరావతికి వెళ్లే రూట్లు నెమ్మదిగా ఉండటంతో, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. అయితే పెరచెర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు లైన్లు ఏర్పాటు చేస్తే, హైదరాబాద్ – అమరావతి మధ్య ప్రయాణం మరింత వేగవంతంగా మారనుంది. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట వాసులు ఇక తక్కువ టైంలో అమరావతిని తాకగలుగుతారు.
ఈ రహదారితో ఏంటా ప్రయోజనం?
ఈ ప్రాజెక్టు అమలవుతున్న తరువాత రాష్ట్ర రాజధాని అమరావతికి అవసరమైన రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగవుతాయి. దాంతో పాటు భవిష్యత్తులో అమరావతి చుట్టూ అభివృద్ధి బాగానే జోరందుకోనుంది. ఈ రహదారి మార్గం భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు కూడా అనుకూలంగా ఉండేలా మౌలిక వసతులతో నిర్మించనున్నారు.
ఈ నూతన హైవే ప్రకటనతోపాటు, అమరావతిని పునర్వికాస పట్టికలోకి తేవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం మరోసారి స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ రూట్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు, రవాణా, ఉద్యోగావకాశాలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి ప్రాజెక్టులు అమలవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం, వేగవంతమైన భూముల సమీకరణ, ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం కీలకంగా మారుతాయి. ఒకసారి ఈ రహదారి పూర్తైతే.. పల్నాడు – అమరావతి – హైదరాబాద్ మధ్య సొగసైన రహదారి అనుభవం ప్రతి ఒక్కరికీ గుండెలు తాకేలా ఉంటుంది!