Aghori News: రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ అఘోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగ్నంగా దేవాలయాలకు వెళ్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే పలు చోట్ల చాలా మందితో గొడవకు దిగుతూ హల్ చల్ చేసింది. పోలీసులను నోటికి ఇష్టమొచ్చినట్టు తిడుతూ వీరంగం సృష్టిస్తుంది. అయితే, తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. శ్రీ వర్షణి అనే అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఈ రోజు లేడీ అఘోరీపై ఫిర్యాదు చేశారు.
మా కూతురుని కిడ్నాప్ చేసింది..
తమ కూతురు శ్రీవర్షిణి కనబడడం లేదని తండ్రి కోటయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని లేడీ అఘోరి కిడ్నాప్ చేసిందని కంప్లైంట్ ఇచ్చారు. అయితే, గత కొన్ని రోజులుగా శ్రీ వర్షిణి లేడి అఘోరీ వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. అయితే శ్రీ వర్షణి తన మాట వినడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి మందు పెట్టి లేడీ అఘోరీ వశం చేసుకుందని తండ్రి కోటయ్య, శ్రీ వర్షణి అన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాడు. అందుకే శ్రీ వర్షిణి మా వద్దకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో తమ కూతురు శ్రీ వర్షణి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లేడీ అఘోరీ సెక్సువల్‌గా టార్చర్ పెట్టింది..
అయితే, లేడీ అఘోరీపై శ్రీవర్షణి అన్న పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘అఘోరీ నన్ను సెక్సువల్ గా టార్చర్ పెట్టింది. ఒకరోజు మా ఇంట్లో ఉన్నప్పుడు మందు, కండోమ్ లు తీసుకురమ్మని ఫోర్స్ చేసింది. అఘోరీకి పొలిటికల్ లీడర్లతో కూడా కనెక్షన్ ఉంది. ఆమెను ఆర్థికంగా కొందరు నేతలు ఆదుకుంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు నా చెంప బుగ్గలు గిల్లడం చేసేది. నా బుగ్గలు కొరికింది. లేడీ అఘోరీ అమ్మాయి కాదు. మగ లక్షణాలు ఉన్న వింత జీవి’ అని చెప్పాడు.
మా చెల్లిని వశపరుచుకుంది..
‘మా చెల్లితో ఏకాంతంగా కూర్చొని ముద్రలు వేసేది. మా చెల్లిని ప్రతిసారి ముద్దులు పెడుతూ ఇరిటేట్ చేసేది. మా మీద పడి బుగ్గలు నెమిరేది. ఇంట్లో ఉన్నన్నీ రోజులు మమ్మిల్ని సెక్సువల్ హారాస్‌మెంట్ చేసింది. మా చెల్లి, లేడీ అఘోరీ ఏ చెబితే అదే చేస్తుంది. చెల్లిని లేడీ అఘోరీ వశపరుచుకుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లిని తోడుగా పెట్టుకుని ఒక్క రూంలోనే ఉన్నారు. మా చెల్లి మానసికంగా బాగో లేదు. లేడి అఘోరీ మందు పెట్టి వశపరుచుకుంది. ఇప్పుడు మా చెల్లి.. మా కుటుంబ సభ్యులు వద్దు. అఘోరీ వద్దనే ఉంటా అంటుంది’ అని శ్రీవర్షిణి అన్న చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో శ్రీ వర్షణి కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీవర్షణి అన్న మాట్లాడుతూ.. ‘పోలీసులు మాకు భరోసా ఇచ్చారు. లేడీ అఘోరీ వద్ద ఉన్న మా చెల్లిని తీసుకువచ్చి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయిస్తాం’ అని పోలీసులు భరోసా ఇచ్చినట్లు ఆయన చెప్పాడు.
ALSO READ: MPs Salary hike: ఎంపీలకు భారీగా జీతాలు, అలవెన్స్ ల పెంపు.. నెలకు ఎంత రానుందంటే?
ALSO READ: AIIMS Recruitment: గుడ్ న్యూస్.. సొంత రాష్ట్రలో ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ.26,500