Malavika Mohanan : ఈ రోజుల్లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు సైతం టాలీవుడ్‌కు రావడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అంతా తమ కెరీర్‌ను ప్రారంభించడానికి టాలీవుడ్‌ను మొదటి మెట్టుగా ఉపయోగించుకొని ఆ తర్వాత వెంటనే బాలీవుడ్‌కు వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. టాలీవుడ్ రేంజ్ వరల్డ్ వైడ్‌గా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా నుండి వస్తున్న హిట్స్… బీ టౌన్ నుండి రావడం లేదు. అందుకే స్టార్లు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పులు ఏంటి, వాటిలో నటించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మాళవికా మోహనన్ బయటపెట్టింది.
బాలీవుడ్‌పై కన్ను
మలయాళ ముద్దుగుమ్మ అయిన మాళవికా మోహనన్ ముందుగా బాలీవుడ్‌లోనే తన ప్రయాణం ప్రారంభించాలని అనుకుంది. కానీ మాలీవుడ్ నుండి ముందుగా పిలుపు రావడంతో అక్కడే హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆపై మెల్లగా బాలీవుడ్ ఆఫర్లను పట్టేసింది. హిందీలో తను నటిగా నిలదొక్కుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు అవకాశాలు రావడం లేదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా అవి హిట్ అవ్వడం లేదు. అందుకే టాలీవుడ్‌పై ఫోకస్ పెంచింది ఈ భామ. ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయని మాళవికా మోహనన్ త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’తో టాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వనుంది. దీంతో తాజాగా టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
అదే రేంజ్
‘‘ఎకానమిక్స్ విషయంలో, స్కేల్ విషయంలో టాలీవుడ్ కూడా బాలీవుడ్ లాగానే అతిపెద్ద ఇండస్ట్రీ. ఏ నటీనటులు అయినా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టకపోతే ఈ రోజుల్లో వాళ్లు చాలా అవకాశాలు మిస్ అయిపోతారు. అందుకే నేను కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ప్రత్యేకంగా తెలుగు క్లాసులు తీసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది మాళవికా మోహనన్ (Malavika Mohanan). చాలామంది ప్రేక్షకులు మాళవికా మాటలకు సమ్మతిస్తున్నారు. నిజంగానే ఈరోజుల్లో బాలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్ ఎదిగిందని, హిందీలో కంటే తెలుగులోనే పాన్ ఇండియా హిట్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. పలువురు బీ టౌన్ స్టార్లు సైతం ఈ విషయాన్ని సమ్మతిస్తున్నారు.
Also Read: షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇండస్ట్రీ..!
హారర్ కామెడీ
మారుతీ (Maruthi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రమే ‘రాజా సాబ్’ (Raja Saab). ఇప్పటికే మారుతీ హారర్ కామెడీ జోనర్‌లో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. అలా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో కలిసి ఇదే జోనర్‌లో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్స్‌తో ప్రభాస్ చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ‘రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికీ ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు అని కన్ఫర్మ్ అయ్యింది తప్పా వీరికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం విడుదల కాలేదు. అయినా ఇప్పటికే వీరిని ‘రాజా సాబ్’ బ్యూటీస్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.