BigTV English

Godavari River: గోదావరి చూడాలని ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Godavari River: గోదావరి చూడాలని ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Godavari River: ఏపీలో ఆ నది వద్ద హడావుడి మొదలైంది. సాధారణంగా ఈ నది ఒక పవిత్రం. ఇంతటి పవిత్రమైన నదిని పుణ్యధామంగా మార్చే పనులు చకచకా సాగుతున్నాయి. మరి ఆ నది ఏమిటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏంటా కథ తెలుసుకుందాం.


భారతదేశపు రెండవ అతిపెద్ద నది అయిన గోదావరి నది, దక్షిణ గంగాగా ప్రసిద్ధి చెందింది. ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ నుండి ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది పక్కన పలు ప్రముఖ గల దైవాలయాలు, పుణ్యక్షేత్రాలు, క్షేత్రాలు ఉండటంతో పాటు, సహజసిద్ధమైన ప్రకృతి అందాలు కూడా ఈ నదికి ప్రత్యేకతను ఇస్తున్నాయి. అలాంటి గొప్ప గోదావరి నది పక్కన ఉన్న పర్యాటక సౌందర్యాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కల్పించడం కోసం ప్రారంభించబోతున్న ప్రాజెక్టే.. అఖండ గోదావరి ప్రాజెక్ట్.

అఖండ గోదావరి అంటే ఏమిటి?
అఖండ గోదావరి అనే పేరులోనే గొప్పతనముంది. ఇది గోదావరి నదిని కేవలం ఒక నదిగా కాకుండా, పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా విలువ గల సంపదగా మారుస్తున్న ప్రణాళిక. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పుష్కర ఘాట్లు, బ్రిడ్జులు, బోటు షికార్లు, నర్సరీలు వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు.


ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి?
అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రధానంగా మూడు లక్ష్యాలను కలిగి ఉంది. గోదావరి తీర ప్రాంతాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం, పుష్కర ఘాట్లు, దేవాలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, పర్యాటకరంగ అభివృద్ధి ద్వారా స్థానికులకి ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని లక్ష్యంగా ప్రభుత్వం ఎంచుకుంది.

Also Read: Bhogapuram Airport: భోగాపురంలో విమానశ్రయమే కాదు.. మరో 500 ఎకరాల్లో.. ప్రభుత్వ కీలక ప్రకటన

ప్రాజెక్టు కింద చేపడుతున్న పనులు
ఈ ప్రాజెక్టులో భాగంగా పలు పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా.. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌ను ఆధునికీకరణ చేయడం, హేవలాక్ బ్రిడ్జి పురాతన రైల్వే వంతెనను పర్యాటక ఆకర్షణగా మార్చే పనులు, కడియం నర్సరీలను అభివృద్ధి చేయడం, తూర్పు గోదావరి జిల్లాలో పూల తోటలు, ఆకర్షణీయ ప్రదర్శన మైదానాలు ఏర్పాటు చేయడం, గోదావరి నదిలో బోటు షికార్లు, సుందర్ టూరిజం మొదలైన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కోట సత్తెమ్మ ఆలయం వద్ద భక్తులకు వసతి గదులు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రతి ప్రదేశంలో ప్రజల కోసం మరుగుదొడ్లు, తాగునీటి ఏర్పాట్లు, చెత్త తొలగింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

నిధులు ఎంత?
ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొదటి దశ పనులు 2025 జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నిధులతో రాజమహేంద్రవరం, నిడదవోలు, కడియం, దవళేశ్వరంలో పలు పనులు చేపట్టనున్నారు. భవిష్యత్తులో మరింత నిధులు మంజూరు చేసే అవకాశముంది.

ప్రయోజనాలు ఏమిటి?
అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలలోకి వెళితే.. దేశీయ, విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశముండి, టూరిజం ఆదాయం పెరుగుతుంది. హోటళ్లు, బోటు సేవలు, గైడ్‌లు, ట్రాన్స్‌పోర్ట్ తదితర రంగాల్లో స్థానికులకు ఉపాధి లభిస్తుంది. భక్తులకు మరింత మెరుగైన వసతులు లభిస్తాయి. పుష్కరాల సమయానికి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు, పర్యాటకులకు అవసరమైన చిన్న వ్యాపారాలు, హస్తకళా కేంద్రాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో చెట్ల నాటింపు, పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పిస్తారు.

అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా కేవలం గోదావరి నది అందాలను పరిచయం చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపైనా దృష్టి పెట్టారు. పర్యాటక, ఆధ్యాత్మిక, ఆర్థిక రంగాలలో అనేక మార్పులు తీసుకురావడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి గొప్ప నదిని ఒక సంపదగా నిలిపేందుకు ఇది చక్కటి అడుగు అని చెప్పొచ్చు. మరి మీరు గోదావరి తీరాన్ని సందర్శించాల్సిన సమయం దగ్గరపడింది.. రెడీగా ఉండండి!

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×