Mani Ratnam: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అలా మణిరత్నం విషయానికి వస్తే మణిరత్నం ఒక లవ్ స్టోరీని డీల్ చేసినట్లుగా మరో దర్శకుడు డీల్ చేయలేరు అని చెప్పాలి. అందుకే మణిరత్నం ను లవ్ గురు అని అంటూ ఉంటారు. మణిరత్నం చేసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ఒక క్లాసిక్ గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఉన్న దర్శకులు చాలామంది మణిరత్నం ను ఇన్స్పైర్ అయ్యి లవ్ స్టోరీస్ చేస్తూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అటువంటి ఛాయలు ఉన్న దర్శకుడు హను రాఘవపూడి. ఏదేమైనా మణిరత్నం ఒక ప్రాపర్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులైంది. మణిరత్నం ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
నాయకుడు సినిమాను మించి ఉంటుంది
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా చాలా అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. నాయకుడు సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుంటుంది అని కమల్ హాసన్ తెలిపారు. నాయకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అని కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను తెలుగు గాడ్ ఫాదర్ అని కొంతమంది అంటూ ఉంటారు. అంత అద్భుతంగా ఒక గ్యాంగ్ స్టార్ ఫిల్మ్ ను డీల్ చేశాడు మణిరత్నం. అటువంటి సినిమాతో పోల్చారు అంటే క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది
నెక్స్ట్ సినిమా శింబుతోనే
ఈ సినిమా అయిపోయిన వెంటనే మణిరత్నం శింబు హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఇప్పటివరకు అధికారక ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరి పెయిర్ చూస్తుంటే ఖచ్చితంగా మణిరత్నం లవ్ స్టోరీ తీస్తాడు అని చాలామందికి అనిపిస్తుంది. ఒక లవ్ స్టోరీస్ విషయంలో శింబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శింబు తమిళ్లో చేసిన ఎన్నో లవ్ స్టోరీస్ తెలుగు ప్రేక్షకులు కూడా చూసి ఆదరించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. ఈ సినిమా గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Krishna Vamsi : సురేష్ బాబు వెంకటేష్ ను ఇస్తా అన్నా కూడా, నేను చక్రవర్తి తోనే తీస్తా అన్నాను