MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. నిరాశపరిచిన మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు రిలాక్స్ మూడ్ లో ఉన్నాడు. తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కి వెళ్లి… చేపలు పట్టుకుంటున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… మహేంద్ర సింగ్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏమాత్రం రాణించలేదు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Also Read: RCB IPL Trophy: బెంగుళూరుకు బంపర్ ఆఫర్.. ఈ సెంటిమెంట్ ప్రకారం RCB కే టైటిల్
చేపలు పట్టుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిన తర్వాత మహేంద్రసింగ్ ధోని రిలాక్స్ అవుతున్నాడు. రాంచీలో చేపలు పడుతూ కనిపించాడు మహేంద్ర సింగ్ ధోని. బ్లాక్ టీ షర్ట్ లో తన ఫామ్ హౌస్ లో.. చేపలు పడుతూ కనిపించాడు ధోని. తన కుటుంబంతో… కలిసి ఎంజాయ్ చేస్తూ.. చేపలు పట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక మహేంద్ర సింగ్ ధోని చేపలు పట్టిన ఫోటో వైరల్ కావడంతో… క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరో ఏడాది కాలం పాటు ధోని ఇలా.. రిలాక్స్ మూడులో ఉంటాడని చెబుతున్నారు. మరికొంతమంది మహేంద్రసింగ్ ధోని నాన్ వెజిటేరియన్ అని… అందుకే విపరీతంగా చేపలు పడుతున్నాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్కు పూర్తిగా రిటర్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లోనే మహేంద్ర సింగ్ ధోని ఇలా రిలాక్స్ మూడులో ఉండాలని కూడా కొంత మంది కోరుతున్నారు. మరి కొంతమంది అయితే చేపల బిజినెస్ లోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ ఇస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Csk Team)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చినా కూడా పరిస్థితి మారలేదు. అదే తీరుగా చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఆడింది. ఈ నేపథ్యంలో 14 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని టీం… కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మొత్తం పది మ్యాచ్ల్లో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలాంటి నేపథ్యంలో ఎనిమిది పాయింట్లు దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్… 10వ స్థానానికి పరిమితమైంది. అయితే చివర్లో వరుసగా మ్యాచులు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… వచ్చే ఏడాది పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: RCB Fan: దిగ్వేశ్ కు నరకం చూపిస్తున్న RCB ఫ్యాన్స్.. ఎయిర్ పోర్టులో కూడా ర్యాగింగ్
MS Dhoni enjoying the fishing after the IPL 2025. 🔥 [Kush Mahi] pic.twitter.com/koDKiMleTh
— Johns. (@CricCrazyJohns) May 29, 2025