Alluri Sita Rama Raju district: ఓ వైపు పురిటి నొప్పులు.. మరో వైపు డోలి మోతలో ప్రయాణం.. సకాలంలో వైద్యం అందుతుందా లేదా అన్న భయాందోళన.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిండు గర్భిణీ మహిళ ప్రయాణం సాగించింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు భగవంతుడా అంటూ ఆ మహిళ ఆవేదన చెందింది. ఎప్పుడయ్యా.. మా బ్రతుకులు మారేది? జీవితాంతం డోలి మోతలు సాగాల్సిందేనా? మావి ప్రాణాలు కావా? మేము ఓటర్లము కాదా అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో జాజుల బంధ అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారుగా 160 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్య పాలైనా, మహిళలు గర్భం దాల్చినా వారి గుండె గుభేల్ మనాల్సిందే. అందుకు ప్రధాన కారణం.. ఆ గ్రామానికి నేటికీ రవాణా సౌకర్యం లేకపోవడమే. అందుకే నేటికీ అక్కడ డోలీ మోతలు మనకు కనిపిస్తాయి. సాధారణ వ్యక్తులను డోలీ మోత అంటే ఆ పరిస్థితి వేరు. అదే మహిళ గర్భం దాల్చిన సమయంలో వైద్యం కోసం డోలీలో తరలించాలంటే, ఆ మహిళ పడే ఆవేదన అంతా ఇంతా కాదు. రహదారులు సక్రమంగా గల రహదారుల్లో గర్భిణీ మహిళను వైద్యశాలను తరలించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే డోలిలో కూర్చొని రావడం అదొక సాహసమనే చెప్పవచ్చు.
ఇలాంటి సంఘటనే గురువారం జాజుల బంధ గిరిజన గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవ వేదనతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో, ఆమె కుటుంబ సభ్యులు డోలీలో ఆర్ల గ్రామం వరకు మోసుకు వచ్చారు. అనంతరం అక్కడి నుండి అంబులెన్స్ సహాయంతో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అర్ల గ్రామం వరకు డోలీలో మోసుకు వస్తున్న క్రమంలో, ప్రసవవేదన అధికమైతే జరిగే ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టమే. స్వాతంత్రం వచ్చి నేటికీ 78 సంవత్సరాలు పూర్తవుతున్నా, ఆదివాసి గిరిజనుల జీవనమనగడలో ఏ మార్పు రాలేదని ఇటువంటి ఘటనలను బట్టి చెప్పవచ్చు.
2023 వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకం నుండి ఈ రహదారి నిర్మాణానికి అక్షరాలా కోటి రూపాయల నిధులు కేటాయించినట్లు సమాచారం. కానీ 28 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్ మధ్యలోనే బదిలీ వేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డిఓ ల దృష్టికి సమస్య వెళ్లినప్పటికీ.. నేటికీ అక్కడ డోలీ మోతలు తప్పని పరిస్థితి. సంవత్సరాలు సాగుతున్నాయి కానీ, తమ గిరిజన గ్రామానికి రహదారి పనులు సాగడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, జాజుల బంధ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించాలని, డోలి మోతలకు శుభం కార్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: AP Electricity Charges: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు
ఇటీవల డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పలు గ్రామాల రహదారుల అభివృద్దికి నిధులను సైతం కేటాయించారు. పవన్ చొరవతో రహదారుల అభివృద్ది పనులు వేగంగా సాగాయి. అదే రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి, తమ గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పించేలా చొరవ చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరి వీరి డోలి మోతలకు పవన్ ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
గిరిజనులకు తప్పని డోలి మోతలు..
పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ నిండు గర్భిణిని డోలిలో అవస్థలు పడుతూ నాలుగు కిలోమీటర్లు మేర తీసుకెళ్లాల్సిన దుస్థితి గిరిజనులకు ఎదురైంది. ఈ సంఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని కొయ్యూరు మండలం జాజులబంధ గిరిజన గ్రామంలో జరిగింది.@naralokesh… pic.twitter.com/a0eztNWRwq
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2025