Amaravati Hitec City: ఇప్పటి వరకూ హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అనేదే అందరికీ తెలిసిన విషయం. దేశంలోనే అగ్రగామిగా ఐటీ రంగాన్ని చాటిన నగరంగా హైదరాబాద్ పేరు దక్కించుకుంది. కానీ ఇప్పుడు ఆ స్థానం మారబోతోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు ఓ అద్భుతమైన హైటెక్ సిటీకి బీజం పడింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక ప్రపంచస్థాయి హైటెక్ క్లస్టర్‌ను నిర్మించేందుకు స్వర్ణాంధ్ర-2047 టాస్క్‌ఫోర్స్ సూచించింది.
అమరావతిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు నూతన అడుగు
తెలుగువారి కలల రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలన కేంద్రంగా మాత్రమే కాకుండా, టెక్నాలజీ అభివృద్ధికి కేంద్రబిందువుగా మారబోతోంది. ఈ హైటెక్ సిటీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి పెట్టనుంది. మరో మాటలో చెప్పాలంటే, ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతే కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది.
హైటెక్ హబ్‌కు నాంది పలికిన స్వర్ణాంధ్ర టాస్క్‌ఫోర్స్
ఈ ప్రతిపాదనకు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి నాయకత్వం వహించేవారు సాధారణ వ్యక్తులు కాదు. స్వర్ణాంధ్ర 2047 టాస్క్‌ఫోర్స్‌కు సిఎం చంద్రబాబు నాయుడు, టాటా గ్రూప్ అధినేత ఎన్. చంద్రశేఖరన్లు సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి అనుభవం, పారదర్శకత, దూరదృష్టి కలిస్తే.. అమరావతిలోని హైటెక్ సిటీపై యువత ఎన్నో ఆశలు ఉంచారని చెప్పవచ్చు.
హైదరాబాద్ స్థాయిలో.. ఇంకా అంతకుమించి!
ఇప్పటి వరకూ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎదగడంలో, అక్కడి మౌలిక సదుపాయాలు, పాలసీలు ప్రధాన పాత్ర పోషించాయి. కానీ అమరావతి ORR చుట్టూ నిర్మించనున్న హైటెక్ సిటీ ఇంకా ముందున్న 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా నిర్మించనుంది. అంటే ఇది కేవలం ప్రస్తుతానికి కాకుండా, భవిష్యత్తులోకి చూస్తూ రూపొందించబడి ఉంది. ఇందులో డీప్ టెక్, బయోటెక్, క్వాంటం కంప్యూటింగ్, డేటా ప్రాసెసింగ్ సెంటర్లు వంటి విభాగాలకు పెద్ద పీట వేయనున్నారు.
యువతకు వేల కొద్దీ ఉద్యోగాలు.. ఇక మైగ్రేషన్‌కు సెలవు
ఇప్పటి వరకూ ఏపీ యువత ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు. అమరావతిలోనే ప్రపంచస్థాయి కంపెనీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే, వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. దీని వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక, స్ధానిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదల, విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Akhanda 2 shooting: నంద్యాల గుహల్లో సినిమా సెట్టింగ్స్.. బాలకృష్ణ రాక ఎప్పుడో?
అమరావతికి కొత్త ఒరవడి.. ఒకే ప్రదేశంలో పాలన, టెక్నాలజీ
తెలుగు రాష్ట్రాల్లో పాలనకి ఒక దిశ, టెక్నాలజీకి మరో దిశ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండూ ఒకే చోట కలవబోతున్నాయి. అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్‌లు, హైకోర్టు, సచివాలయం, మరోవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హార్డ్‌వేర్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు.. ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు టెక్ పునాది.. గోల్డ్‌హబ్ గమ్యం
ఈ హైటెక్ సిటీ అభివృద్ధి కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదని, అది స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక మైలురాయి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ హైటెక్ క్లస్టర్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అనే ధృవీకరణ ఇక చరిత్ర కావచ్చు. ఐటీ అంటే తెలంగాణ అనే ఆలోచనకు ఇక ముగింపు లేఖ రాసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలుగు యువతకు అవకాశాలు తమనే వరిస్తున్నాయన్న బలమైన సందేశం ఇప్పుడు అమరావతి నుంచి వెల్లువెత్తుతోంది. హైటెక్ శకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్లకు ఓ కొత్త చిరునామా.. అమరావతి హైటెక్ సిటీ!