AP Deputy CM Pawan Kalyan has viral fever: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ అటాక్ అయింది. ఈ మేరకు ఆయన జ్వరం,చ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఫీవర్‌తో ఇబ్బంది పడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. గురువారం కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే, జ్వరం ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఏపీలో నెలకొన్న భారీ వర్షాలతోపాటు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు బుడమేరు పొంగిపొర్లడంతో నష్టం వాటిల్లింది. అయితే దీనిపై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదికి కూడా వరద పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు వాగు ప్రళయం సృష్టించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా ఉంటున్నారు.
Also Read: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నాడంటే?
అయితే, వరదల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడూ పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. గురువారం పలు కాలనీల్లో పవన్ కల్యాణ్ పర్యటించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే బాధితుల యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు.
వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు.
అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ
— I & PR Andhra Pradesh (@IPR_AP) September 5, 2024