Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబు రూటు మార్చారా? రాజకీయాలను పక్కన పెట్టేసి చంద్రబాబు సర్కార్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టారా? సీఎంని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కొత్త అస్త్రాన్ని ప్రయోగించారా? దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇంతకీ అంబటి సంధించిన ప్రశ్న ఏంటి?
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి చెప్పనక్కర్లేదు. ఏ విషయమైనా సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు.. లేకుంటే ప్రశ్నిస్తారు. ఆయన రాజకీయాలను పక్కన పెట్టేశారో ఏమోగానీ సీఎం చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. కామన్ జెండాను పట్టుకుని అస్త్రాన్ని సంధించారు. అంబటి ప్రశ్నపై ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారన్నది అసలు ప్రశ్న.
ఈ మధ్యకాలంలో జనాభాను పెంచాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. జననాలు తగ్గిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఊహించని పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఐరోపా దేశాలు అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గురించి చైనా, ఆయా పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై దృష్టి పెట్టారు అంబటి రాంబాబు. మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలుకావాలని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘నువ్వు మీ నాన్నకి ఒక్కడివి.. నీకు ఒక్కడు’’. దేశంలో ఉన్నజనాభాను పిల్లలను కనాలని చెబుతారని, నువ్వు మాత్రం ఒక్కరినే ఎందుకు కన్నారని ప్రశ్నించారు.
ALSO READ: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల
అంబటి రాంబాబు ప్రశ్నపై చాలామంది ఆలోచనలో పడ్డారు. ఆయన ప్రశ్నను సమర్థించేవారు కొందరైతే.. వ్యతిరేకించేవారు ఇంకొందరు. మార్పు అనేది మన నుంచి మొదలుకావాలని అంటున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది ఒక్కరే చాలని డిసైడ్ అయ్యారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే చాలామందికి పిల్లలు పుట్టక రకరకాల పద్దతులను అవలంభిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
అంబటి ప్రశ్నకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి. జనాభా తగ్గడం వల్ల వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడుతారు. దానివల్ల యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయి. నిరుద్యోగం తాండవిస్తోందని గుర్తు చేస్తున్నారు నిపుణులు.
చైనాతోపాటు చాలా దేశాలు గతంలో కేవలం ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు. దాని పరిణామాలు తెలిసిన తర్వాత పిల్లలను కనేందుకు ప్రొత్సాహకాలు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగం భయం కారణంగా ఒక్కరితో సరిపెడుతున్నట్లు అంటున్నవాళ్లు లేకపోలేదు.
నువ్వు మీ నాన్నకి ఒక్కడివి, నీకు ఒక్కడు. చంద్రబాబు దేశంలో ఉన్న అందర్నీ పిల్లలని కనమని చెప్తాడు. ఆయన, నువ్వు మాత్రం ఒక్కరినే కంటారు.
– మాజీ మంత్రి అంబటి రాంబాబు pic.twitter.com/ldLeGijwZ5
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025