BigTV English

Ambati Rambabu : అల్లుడి వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్.. పవన్ కల్యాణ్ నీకిది తగదు..

Ambati Rambabu : అల్లుడి వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్.. పవన్ కల్యాణ్ నీకిది తగదు..

Ambati Rambabu Reaction on Son-in-Law Comments : వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు పై ఆయన చిన్న అల్లుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంబటి రాంబాబంత నీచుడు, నికృష్టుడు ఉండడని డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. నిజానికి గౌతమ్ పెట్టిన పోస్ట్ పై స్పందించకూడదని అనుకున్నా.. కానీ పవన్ కల్యాణ్ దానిపై కామెంట్ చేయడంతో స్పందించక తప్పలేదన్నారు. పవన్ కల్యాణ్ పొన్నూరుకు వచ్చి తనతో పాటు.. తన తమ్ముడిపై చేసిన వ్యాఖ్యలకు స్పందించవలసి వస్తుందన్నారు.


గౌతమ్ తన కుమార్తెను వదిలేసి నాలుగేళ్లు అవుతుందని, ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తుందని తెలిపారు. తన అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్ట్ వెనుక పవన్ కల్యాణ్, చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. కుటుంబ సమస్యల్ని రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి వారంతా దిగజారి పోయారని దుయ్యబట్టారు. పెళ్లాడిన భార్యను, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసిన దుర్మార్గుడు గౌతమ్ అని పేర్కొన్నారు.

Also Read : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు


ఇప్పుడు తన అల్లుడు విడాకులు కోరినా.. అది ఇంకా పూర్తి కాలేదన్నారు. మున్ముందు కాంప్రమైజ్ అయి ఇద్దరూ సుఖంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి కుటుంబ గొడవలను రాజకీయాలకు వాడుకోవడం సబబు కాదన్నారు. అల్లుడే అంబటికి ఓటు వేయొద్దని అంటున్నాడని పవన్ కల్యాణ్ పొన్నూరుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి రాజకీయాలు అవసరమా ? నీఛమైన రాజకీయాలు చేసి ఎలక్షన్ నుంచి తన దృష్టిని మరలించాలని అనుకుంటున్నారని వాపోయారు. పవన్ కల్యాణ్ తన అల్లుడి పోస్ట్ పై మాట్లాడిన కారణంగానే స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా తమ కుటుంబానికి సంబంధించిన విషయమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

అంబటి రాంబాబంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని తన జీవితంలో చూడలేదని అల్లుడు గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. గౌతమ్ వీడియో చూసిన వారంతా అంబటి రాంబాబు అంత నీచుడా అని చర్చించడం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు గౌతమ్ చేసిన వ్యాఖ్యలు అంబటి రాంబాబు రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయా అని గుసగుసలాడుకుంటున్నారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×