BigTV English
Advertisement

Karun Nair : టీమిండియా నుంచి కరుణ్ నాయర్ ఔట్… కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ భార్య!

Karun Nair : టీమిండియా నుంచి కరుణ్ నాయర్ ఔట్… కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ భార్య!

Karun Nair : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు  సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాడు కరుణ్ మూడు టెస్టు మ్యాచ్ ల్లో ఆడితే అతను ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. ముఖ్యంగా మూడో టెస్టులో కరుణ్ నాయర్ ప్రదర్శన పై పలువురు సీనియర్, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాజీ భారత వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్త కరుణ్ నాయకర్ నెం.3 స్థానంలో ఉండటం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అతని స్థానంలో మరో యువ ఆటగాడిని సూచించారు. ప్లేయింగ్ ఎలెవన్ లో ఒకరి కంటే ఎక్కువ మార్పులు ఉండకూడదని అనుకుంటే.. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ ఉండాలన్నారు. కరుణ్ నాయర్ అంతగా పరుగులు ఏమి చేయలేదు. 


Also Read : IND vs ENG 4th Test : రిషబ్ పంత్ పోరాటం వృధా..టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

కరుణ్ స్థానంలో సాయి సుదర్శన్.. 


అతను అంత సౌకర్యవంతంగా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.  మరోవైపు సాయి సుదర్శన్ ని జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న తర్కాన్ని కూడా వివరించాడు. సాయి సుదర్శన్ ఒక యువ ఆటగాడని.. ఇంగ్లాండ్ సిరీస్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే యువ ఆటగాడిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే.. యువ ఆటగాడిపై పెట్టుబడి పెట్టడం మంచిది. కరుణ్ నాయర్ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆరంభాలు సాధించినప్పటికీ అంతగా నమ్మకంగా కనిపించడం లేదు. భవిష్యత్ కోసం జట్టును నిర్మించాలనుకుంటే.. సాయి సుదర్శన్ లాంటి ఆటగాడిపై దృష్టి సారించడం మంచిదని తెలిపారు.  ఇక ఈ నేపథ్యంలోనే  కరుణ్ నాయర్ ను నాలుగో టెస్ట్ నుంచి డ్రాప్ చేశారు. నాలుగో టెస్ట్ లో అతని ప్లేస్ లో సాయి సుదర్శన్ వచ్చాడు.  అయితే కరుణ్ అటు రోహిత్ శర్మ ఇద్దరూ ఫేసులు సేమ్ ఉంటాయి. అందరూ అతన్ని చూసి రోహిత్ శర్మ అనుకుంటారు.  కరుణ్ నాయర్ ని తప్పించడంతో రోహిత్ శర్మ భార్య రితిక ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కరుణ్ నాయర్ పై  సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.

ఎనిమిదేళ్ల తరువాత ఎంట్రీ.. కానీ..!

వాస్తవానికి కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తరువాత టీమిండియా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ ప్రస్తుత సిరీస్ లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్ లో 131 పరుగులు మాత్రమే చేిస.. సగలు స్కోరు 21.83గా ఉంది. ఇక నెంబర్ 3 బ్యాటర్ గా అతని నుంచి ఆశించిన స్థిరత్వం పెద్ద స్కోర్లు రాలేదు. ఇక సాయి సుదర్శన్ విషయానికి వస్తే.. అతను మొదటి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసి కొంత నమ్మకం కలిగించాడు. ఆ తరువాత అతన్ని జట్టు నుంచి తొలగించారు. యువతకు అవకాశం ఇవ్వాలనే వాదన బలంగా ఉన్న నేపథ్యంలో నాలుగో టెస్టులో అనుకున్నట్టుగా సాయి సుదర్శన్ ని తీసుకున్నారు. సాయి సుదర్శన్ ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×