E-Paper
Advertisement

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?
Advertisement

Anakapalli Protest: అనకాపల్లి జిల్లాలో గిరిజనులు రోజుకో వినూత్న నిరసన చేపడుతున్నారు. మౌలిక వసతులు కల్పించాలంటూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉరితాళ్లతో ఆందోళన చేపట్టారు. వి. మాడుగుల మండలం శంకరం పంచాయతీ పరిధిలోని తాడివలస, కొత్తవలసతో పాటు ఆరు గ్రామాల ప్రజలు రోడ్లు, బ్రిడ్జిలు లేక ఏళ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గెడ్డలు దాటలేక అత్యవసర వైద్య సేవలు పొందడం కూడా కష్టంగా మారుతోందని చెబుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిధులు కేటాయించి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ప్రజాప్రతినిధులను నిలదీయడానికి తమ గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం కోసం గిరిజనులు వినూత్న పరిధిలో ఆందోళనలు చేపడుతున్నారు.

ఎన్నికల నేపథ్యంలో..

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన గ్రామాలకు కనీస మౌలిక వసతులు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు లేవు, గెడ్డలపై బ్రిడ్జిలు లేవు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లాలో ఆరు గ్రామాల గిరిజనులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం శంకరం పంచాయతీ పరిధిలోని గిరిజనులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మౌలిక వసతులు గ్రామాల సమస్యలను పరిష్కారం చేయాలని ఆందోళనలను ఉదృతం చేస్తున్నారు. రాజంపేట, రాయిపాలెం, తాడివలస, గొప్పూరు, వెలగలపాడు, కొత్తవలస గ్రామాలకు రోడ్లు వేయాలని తాడివలస వద్ద గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. గెడ్డలపై బ్రిడ్జిలు నిర్మించి రహదారులు కల్పించాలంటూ ఉరితాళ్లతో నిరసన తెలిపారు.

Advertisement

Also read: IRCTC టికెట్ బుకింగ్.. సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడే సూపర్ టిప్స్!

ఆవేదన వ్యక్తం..

తాడివలస వద్ద బ్రిడ్జి నిర్మిస్తే ఆరు గ్రామాల ప్రజలకు గ్రామ సచివాలయానికి రాకపోకలు సులభమవుతాయని, వర్షాకాలంలో గెడ్డలు పొంగిపొర్లినప్పుడు గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గెడ్డలు దాటలేక గర్భిణులు అక్కడే ప్రసవించిన ఘటనలు ఉన్నాయని, వైద్యం అందక ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకారులు మండి పడుతున్నారు.

పవన్ కల్యాణ్‌..

Advertisement

బ్రిడ్జిల నిర్మాణం కోసం సుమారు 11 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పవన్ కల్యాణ్‌కు పంపించామని గిరిజనులు చెప్తున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గతంలో ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ఆరు గ్రామాలకు రహదారులు, బ్రిడ్జిలు నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Also read: విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

Tags

Related News

రాజమండ్రి మున్సిపల్ మేయర్ ఆశావహులకు బిగ్ షాక్.. తలకిందులైన లెక్కలు!

విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీన్ రివర్స్.. జనసేనలోకి వంగవీటి రాధా! విజయవాడ మేయర్‌గా బరిలోకి

విజయసాయిరెడ్డికి మళ్లీ ఏమైంది.. బాల్‌ఠాక్రే‌తో పోలిక పెట్టి, ఆ తర్వాత..

పబ్‌లో ఏపీ ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసు అధికారులపై దూషణలు, ఎవరా ఆ అధికారి?

సీఎం చంద్రబాబు-సీఎం విజయ్ మధ్య కీలక అంశం అదే.. డ్లికరేషన్ మాటేంటని వైసీపీ ప్రశ్నలు

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Big Stories

Advertisement
×