E-Paper
Advertisement

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ
Advertisement

Hanging by a Wire on OTT : ఎత్తైన కొండలు, లోతైన లోయలు, చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు… ఇలాంటి ప్రాంతాల్లో కేబుల్ కారులో ప్రయాణించడం చాలామందికి మరిచిపోలేని అనుభూతి. కానీ అదే కేబుల్ కారులో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తి, కదలకుండా గాలిలోనే ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? కిందికి చూస్తే వందల అడుగుల లోతు… చుట్టూ సహాయం చేసేవారు కనిపించరు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. అలాంటి పరిస్థితిలో చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక బృందాలు చేసే ప్రయత్నాలు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో చూపించే డాక్యుమెంటరీ ‘హ్యాంగింగ్ బై ఎ వైర్’ (Hanging by a Wire). మరి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది ప్రమాదం గురించి చెప్పే కథ కాదు. ప్రమాదంలో చిక్కుకున్న మనుషుల భయం, వారిని కాపాడేందుకు ప్రయత్నించే సిబ్బంది ఒత్తిడి, ప్రతి నిమిషం విలువైనదిగా మారే పరిస్థితులను ప్రధానంగా చూపించే రియల్ లైఫ్ సర్వైవల్ స్టోరీ. 2023 ఆగస్టులో పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో ఖైబర్ పఖ్తూంక్వాలోని బట్టగ్రామ్ సమీపంలో, ఒక కేబుల్ కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సుమారు 900 అడుగుల ఎత్తులో చిక్కుకుపోవడం ఈ కథకు కేంద్రబిందువు. కేబుల్ కారు ఆగిపోయిన క్షణం నుంచి వారి ప్రయాణం భయంకరమైన పరీక్షగా మారుతుంది.

Advertisement

సాధారణ పరిస్థితుల్లో కేబుల్ కారులో ప్రయాణం కొద్ది నిమిషాల్లో ముగిసిపోతుంది. కానీ ఇక్కడ ఆ కొద్ది నిమిషాల ప్రయాణమే ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితిగా మారుతుంది. ఎత్తులో వేలాడుతున్న వాహనం నుంచి సురక్షితంగా బయటపడటం అంత సులభం కాదు. కిందికి దిగేందుకు మార్గం లేదు. ప్రమాదం మరింత పెరగకుండా ఎలా బయటపడాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఎదురు చూడాల్సి వస్తుంది.

ఇలాంటి సమయాల్లో భయాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా పెద్ద సవాలే. చిక్కుకున్న వారి ఆందోళన ఒకవైపు ఉంటే, వారిని చేరుకోవడానికి మార్గాలను వెతికే రక్షణ బృందాలకు మరోవైపు సమయం, భద్రత రెండూ కీలకంగా మారతాయి. ఒక్క తప్పు నిర్ణయం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంటుంది. అందుకే రక్షణ చర్యల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది.

Advertisement

ఈ డాక్యుమెంటరీలో ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంతో పాటు, సహాయక చర్యలు ఎలా సాగాయి, ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనే విషయాలపై దృష్టి పెట్టారు మేకర్స్. ప్రమాదంలో ఉన్నవారి అనుభవం, వారిని కాపాడేందుకు పని చేసే బృందాల ఒత్తిడి, ఆ టైమ్ లో ప్రతి క్షణం కీలకంగా అనిపిస్తుంది.

Also Read : చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘హ్యాంగింగ్ బై ఎ వైర్’ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 29 నుంచి పారామౌంట్ ప్లస్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. నిజ జీవిత ప్రమాదాలు, ప్రాణాలను కాపాడేందుకు జరిగే పోరాటాలు, చివరి క్షణం వరకు ఉత్కంఠను కొనసాగించే డాక్యుమెంటరీలు చూడాలి అనుకుంటే ఈ డాక్యుమెంటరీని డోంట్ మిస్. ఎత్తులో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడం ఎంత కష్టమైన పని అయింది ? ఆ రక్షణ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? అనే అంశాలే ఈ కథనాన్ని చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేస్తాయి.

Related News

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

బాక్సింగ్ రింగ్‌లో ప్రపంచాన్ని వణికించిన మైక్ టైసన్… కట్ చేస్తే వివాదాలు, జైలు జీవితం, పతనం

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

Big Stories

Advertisement
×