E-Paper
Advertisement

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!
Advertisement

Makhana Business: భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘మఖానా’ (ఫాక్స్ నట్స్)కు విపరీతమైన డిమాండ్ ఉంది. సాధారణ రోస్టెడ్ స్నాక్స్ నుంచి మఖానా పిండి, పాస్తా వరకు రకరకాల రూపాల్లో ఇది ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన ఇద్దరు మిత్రులు ఈ స్థానిక పంటను నమ్ముకుని సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కేవలం రూ. 3 లక్షల పెట్టుబడితో మొదలైన వారి ప్రయాణం.. నేడు కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది.

బెంగళూరు ఉద్యోగం వదిలి..

బిహార్‌కు చెందిన సయ్యద్ ఫరాజ్, శిశిర్ శుభమ్ మంచి స్నేహితులు. ఫరాజ్ బెంగళూరులో దాదాపు దశాబ్ద కాలం పాటు ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సొంతూరికి తిరిగి వచ్చి కొన్ని వ్యాపారాలు ప్రయత్నించినప్పటికీ అవి వర్కవుట్ కాలేదు. చివరకు తమ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘మఖానా’ పంటపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 2021 నవంబర్ లో ‘షే ఫూడ్స్’ (Shhe Foods) సంస్థకు అంకురార్పణ చేశారు.

B2B మోడల్‌తో వినూత్న ప్రయాణం

Advertisement

సాధారణంగా చాలామంది నేరుగా కస్టమర్లకే ఉత్పత్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఫరాజ్, శిశిర్ జోడీ భిన్నంగా ఆలోచించి ‘బిజినెస్-టు-బిజినెస్’ (B2B) వైట్-లేబ్లింగ్ మోడల్‌ను ఎంచుకున్నారు. షే ఫూడ్స్ సంస్థ ఇతర ఆహార కంపెనీలకు కావలసిన ముడి (Raw), మసాలా రుచులతో కూడిన మఖానాలను సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకుంది. సదరు కంపెనీలు తమ సొంత బ్రాండ్ పేర్లతో మార్కెట్లో వాటిని విక్రయిస్తుండటం విశేషం.

300 మంది రైతులతో నెట్ వర్క్

ప్రస్తుతం ఈ సంస్థ బీహార్‌లో 300 మందికి పైగా రైతులతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. భారతదేశంతో పాటు యూఏఈ (UAE), అమెరికా (US) వంటి అంతర్జాతీయ మార్కెట్లలోని 41కి పైగా బ్రాండ్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ‘మార్కెటింగ్ మిర్రర్స్’ నివేదిక ప్రకారం.. ఈ కంపెనీ సగటున నెలకు సుమారు రూ. 1.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. B2B వ్యాపారంతో పాటు ‘మఖాన్జా’, ‘న్యూట్రిమిక్స్’, ‘మాకెట్’ వంటి సొంత కన్స్యూమర్ బ్రాండ్లను కూడా ఈ సంస్థ ప్రారంభించింది.

Advertisement

Also Read: ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

ఉత్పత్తుల వైవిధ్యం, తయారీ విధానం

షే ఫూడ్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బిహార్‌లోని ప్రసిద్ధ మిథిలా ప్రాంతం నుంచి మఖానాలను సేకరిస్తారు. దర్భంగాలోని యూనిట్‌లో వీటిని ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. ఇక్కడ తయారయ్యే స్నాక్స్ నూనెలో వేయించినవి కాకుండా పూర్తిగా రోస్ట్ చేసినవి లేదా బేక్ చేసినవే కావడం విశేషం. కేవలం సాధారణ, ఫ్లేవర్డ్ మఖానాలే కాకుండా.. మఖానా కుకీలు, పిండి, పాస్తా, మకరనీ వంటి విభిన్న రకాల ఆహార ఉత్పత్తులను కూడా వీరు అందిస్తున్నారు. మెుత్తంగా రూ.3 లక్షల పెట్టుబడితో మెుదలైన సయ్యద్ ఫరాజ్, శిశిర్ శుభమ్ ల వ్యాపార ప్రయాణం.. నేడు వృక్షంగా మారి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Also Read: రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

Tags

Related News

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వాయిదా.. అక్టోబర్ 15 నుంచి కాదు, దీపావళి తర్వాతే

ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?

బంగారం-వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? బులియన్ మార్కెట్ వర్గాల మాటేంటి?

Big Stories

Advertisement
×