Jasprit Bumrah: ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ “కోల్డ్ ప్లే” (Coldplays) ఇండియా పర్యటన ఘనంగా సాగుతోంది. గత వారం ముంబైలో నిర్వహించిన ఈ కోల్డ్ ప్లే కన్సర్ట్ కి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. కానీ ఈవెంట్ లో బ్యాండ్ పెర్ఫార్మెన్స్ కాస్త నిరాశపరిచింది. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం, శనివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్డ్ ప్లే ఫర్ఫార్మ్ జరిగింది.
Also Read: Champions Trophy 2025: ట్రోపీ కంటే ముందే టీమిండియాకు అగ్ని పరీక్ష..పిల్లబచ్చాలతోనే?
మొదటి రోజు శుక్రవారం జరిగిన ప్రదర్శనకు భారీ స్పందన లభించింది. ఈ ప్రదర్శనకు ఏకంగా 1,32,000 మంది హాజరైనట్లు సమాచారం. ఈ కోల్డ్ ప్లే పాటలకు స్టేడియం అంతా ఉర్రూతలూగింది. శనివారం జరిగిన కన్సర్ట్ ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కన్సర్ట్ కి భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ని చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శనివారం రోజు జరిగిన వేడుకకి దాదాపు లక్షమంది హాజరయ్యారు.
అహ్మదాబాద్ లో జరిగిన ఈ కోల్డ్ ప్లే కన్సర్ట్ లో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సందడి చేశారు. ఈ ఈవెంట్ లో బుమ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతేకాదు ఈ సందర్భంగా స్టార్ సింగర్ క్రిస్ మార్టిన్.. బుమ్రాపై ఓ స్పెషల్ సాంగ్ ని కూడా పాడారు. “జస్ప్రీత్.. మై బ్యూటిఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వుడ్ డు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్” అంటూ క్రిస్ మార్టిన్ సాంగ్ ఆలపించగా.. బుమ్రా ఆస్వాదించారు.
అలాగే ఈ కన్సర్ట్ లో ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ లో బుమ్రా అద్భుత ప్రదర్శన తాలూకు వీడియోని కూడా ప్రదర్శించారు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా అరవడంతో ఈవెంట్ మార్మోగిపోయింది. ఈ కన్సర్ట్ లో బుమ్రా సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో గాయం కారణంగా మధ్యలోనే మైదానం వీడాడు బుమ్రా.
ఆ తర్వాత అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 టి-20 సిరీస్ లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు సెలక్టర్లు. ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో తిరిగి జట్టులోకి పునరాగమనం చేస్తాడు బుమ్రా.
Also Read: Mohammed Siraj: ఒరేయ్…ఆమె నా చెళ్లెలు.. డేటింగ్ పై సిరాజ్ క్లారిటీ..!
ఇదిలా ఉంటే.. తాజాగా 2024 టెస్ట్ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో అత్యుత్తమ జట్టును ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ). ఈ టీంలో ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇందులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తో పాటు ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టుకు ఎంపికయ్యాడు.
The ‘game changer’ player is in the house 🔥 turning everything yellow 💛#ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 26, 2025