AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లే మండలంలో యర్రగుంట్ల వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపి 10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రమాదేవి మరణించారు.
చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో వెళ్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమాదేవిగారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగ మరో నలుగురికి గాయాలు అయ్యాయి.. రమాదేవి మరణం గురించి తెలిసిన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంలో గాయాలైన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయాలైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.