Kalyan Ram: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు రాజమౌళి మినహా ఏ దర్శకుడు కు దక్కని అనుభవం ఒకటి అనిల్ రావిపూడి కి దక్కింది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కెరీర్లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని నేడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసుకునే రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అనిల్ రావిపూడి కెరియర్లో సినిమాలు చేయడమే కాకుండా ఆ సినిమాలను జనాల మధ్యకు తీసుకువెళ్తాడు అని మంచి పేరును కూడా సాధించుకున్నాడు. మామూలు కథలతో ప్రేక్షకులను అలరించి వందల కోట్లు కలెక్షన్స్ రాబడతాడు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి సక్సెస్ సాధించి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
కళ్యాణ్ రామ్ ఇచ్చిన అవకాశం
అనిల్ రావిపూడి మొదట తన కథను కళ్యాణ్ రామ్ కు చెప్పాడు. అయితే అప్పటికే కళ్యాణ్ రామ్ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునే తరుణంలో ఉంది. ఓం అని సినిమాను చేసి చాలా వరకు డబ్బులు కూడా నష్టపోయాడు కళ్యాణ్ రామ్. అయితే ఆ సినిమా పోయినా కూడా అనిల్ రావిపూడి చెప్పిన కథ విన్న వెంటనే ఈ సినిమాకి హీరో నేను, ఒకవేళ నేను హీరో కాకపోయినా కూడా ఈ సినిమాకి నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. నిన్ను నేను దర్శకుడుగా పరిచయం చేస్తాను అంటూ అనిల్ రావిపూడి కి మాట ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ చెప్పిన ఆ మాటలను వినగానే అనిల్ రావిపూడి బాగా ఎమోషనల్ అయిపోయారట. అప్పటికే నిర్మాతగా నష్టాల్లో ఉన్న కూడా అనిల్ ని పరిచయం చేయటం అనేది మామూలు విషయం కాదు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద పటాస్ సినిమా మంచి సక్సెస్ సాధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడుని అందించింది.
మెగాస్టార్ తో సినిమా
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలు కంటూ ఉంటారు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్లు చిరంజీవి హీరోగా ఎప్పటినుంచో సినిమా చేయాలి అని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వీరిద్దరూ మినహా చాలా మంది యంగ్ దర్శకులకు ఈ అవకాశం దక్కింది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ వీడియో కూడా ప్రేక్షకుల్లోకి విపరీతంగా చేరిపోయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. మెగాస్టార్ లో ఎప్పటినుంచో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఈ సినిమాతో మరోసారి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
Also Read : Spirit Movie : ‘స్పిరిట్’ స్టోరి ఇదే.. థియేటర్లు బ్లాస్ట్ పక్కా డైరెక్టర్ కామెంట్స్..