Lulu Malls: ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం ఎంఓయూలతో కాకుండా వీలైనంత త్వరగా కంపెనీలు, పరిశ్రమలు, మాల్స్ పెట్టేందుకు చకచక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలో లూలు గ్రూప్ తలపెట్టిన రెండు మాల్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనికి సంబంధించి భూములను సైతం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీకి రెండు లూలు మాల్స్ రానున్నాయి. ఒకటి విశాఖ, మరొకటి విజయవాడు. ఏపీలో తొలుత ఈ రెండు నగరాలు పెద్దవి కావడంతో తొలుత ఇక్కడ ఏర్పాటు చేసేందుకు లూలు గ్రూప్ మొగ్గు చూపింది. విశాఖలో బీచ్ రోడ్డులో హార్బర్ పార్క్ సమీపంలోని 13.74 ఎకరాల భూమిని ఉంది. దాన్ని 99 ఏళ్ల లీజుకు కేటాయింపు చేసింది ప్రభుత్వం.
అలాగే విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్ కోసం భూమిని కేటాయించింది. ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు పరిశ్రమలు-వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదివారం జీవో-ఎంఎస్-137ను జారీ చేశారు.
ఏపీఐఐసీ ద్వారా ఆయా భూములను కేటాయించింది ప్రభుత్వం. లులు సూపర్ మార్కెట్‌తోపాటు లులు ఫ్యాషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ అందులో ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. మూడేళ్ల లీజు మాఫీని వర్తింపజేయాలని డిసైడ్ అయ్యింది. అయితే భూములు కేటాయింపు రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 ప్రకారం ధరను నిర్ణయిస్తారు.
ALSO READ: టీటీడీలో ఎస్టేట్ దందా? వెనుకున్నదెవరు?
కోర్టు కేసుల పరిష్కారానికి ఏపీఐఐసీ-రెవెన్యూ శాఖ విభాగాలు చర్యలు తీసుకోనున్నాయి. విజయవాడలో ఆర్టీసికి చెందిన 4.15 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ స్థలంలో ఆర్టీసీ నిర్మాణాలను వేరే చోటికి తరలించనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి భూమిని ఇచ్చి ఆ ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. రెండు ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి చర్యలు ఆదేశాల్లో ప్రస్తావించింది. ఏడాదిలో పూర్తి చేయాలన్నది లూలు గ్రూప్ ఆలోచన.