BigTV English

Tirumala Tirupati: టీటీడీలో ఎస్టేట్ దందా! వెనుక ఉన్నది ఎవరు?

Tirumala Tirupati: టీటీడీలో ఎస్టేట్ దందా! వెనుక ఉన్నది ఎవరు?


Tirumala Tirupati: పాలకమండలా అయితేనేం.. వీ డోంట్ కేర్ అన్నట్లు ఉంది టీటీడీలోని ఎస్టేట్ విభాగం పనితీరు.. తిరుమలలో ఓ హోటల్ మూయించే వ్యవహారంలో సాక్షాత్తూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేసినా… లోపాయికారీగా ఆ హోటల్ యాజమాన్యానికి సహాకారిస్తు వారు రెండవ సారి కోర్టుకు పోవడానికి ఎస్టేట్ అధికారులు సహాకరిస్తున్నారంట. . దాంతో పాటు తిరుమలలో దుకాణాల తట్టల వ్యవహారంలో గతంలో పని చేసిన బ్రోకర్లతో సంబంధాలు నెరపుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారనే అరోపణలున్నాయి.. తాజాగా పాలక మండలి తీర్మానం అమలులో కావాలనే అలస్యం చేసి అవతల వారికి కావాల్సినంత సమయం ఇస్తూ వారు కోర్టుకు పోవడానికి ఎస్టేట్ విభాగం సహాకరించిందంట..ఎందుకు ఎస్టేట్ విభాగం లోని ఉద్యోగులకు పాలకమండలి అంటే అంత అలుసు? అసలు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఎవరు?

కొండపై టీటీడీ పాలకమండలి ఆదేశాలను పట్టించుకోని అధికారులు


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలు తిరుమల కొండపై సుప్రీం కోర్టు తీర్పులాంటివి. అలాంటి నిర్ణయాలను టీటీడీలో పనిచేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. పాలక మండలి ఏ నిర్ణయం తీసుకున్నా అమలు విషయంలో చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది అసలు టిటిడి పాలక మండలి ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీటీడీత పాలక మండలి చైర్మన్ బీఅర్ నాయుడు పెత్తనం చేసే వ్యక్తి కాదు. గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన పాలక మండలి అధ్యక్షుల్లాగా మంది మాగాదులు అంతా తన చుట్టు ఉండాలని, అధికారగణం అంతా తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. తన ఆదేశాల కోసం ఎదురు చూడాలనే భావించే వ్యక్తి కాదన్న అభిప్రాయం ఉంది . తిరుమలలో ఉన్న కూడా ఏనాడు అయన హాడావుడి కనిపించదు. అయితే దాన్ని అలుసుగా తీసుకున్న అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహారిస్తున్నారంట. ముఖ్యంగా ఎస్టేట్ విభాగం విషయంలో బీఆర్ నాయుడు మొదటి నుంచి ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నా వారు లైట్ తీసుకుంటున్నారంట

తిరుమల ఎస్టేట్ అధికారిగా వెంకటేశ్వర్లను నియామకం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో భ్రస్టు పట్టిపోయిన వ్యవస్థల ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడుతున్నానని ప్రకటించారు. అందులో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి శ్యామలరావును ఈఓగా నియమించారు. అయనతో పాటు కొంతమంది టీమ్ తిరుమలకు వచ్చింది. తిరుమల ఎస్టేట్ అధికారి గా వెంకటేశ్వర్లను నియమించారు. అయితే అయన వచ్చిన తర్వాత కూడా ఆ విభాగంలో ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. చివరకు కనీస సంస్కరణలు కూడా చేపట్టలేదంటున్నారు. దళారులు దందా యదేచ్చగా కొనసాగుతోందంట. అనధికారికంగా తట్టలు పెట్టుకున్న వారు ఇంకా పేట్రేగిపోతున్నారంటున్నారు. గత ప్రభుత్వములో తిరుమలలో దళారులుగా దందాలు కొనసాగించిన వడ్డీ వ్యాపారులు ఇప్పటికీ తమ అనధికార పెత్తనం కొనసాగిస్తున్నారంట. వీటికి తోడు గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి అఖిలాండం వద్ద తట్టలు పెట్టుకోవడాన్ని నిషేధించారు. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున అక్రమంగా తట్టలు పెట్టుకున్నారు. దీంతో పాటు అనేక అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు.

వివాదాస్పదంగా మారిన రాయల్ సారంగీ హోటల్ వ్యవహారం

తిరుమలలో అత్యంత వివాదాస్పదంగా రాయల్ సారంగీ హోటల్ వ్యవహారం నడుస్తోంది.. దాని లీజు దారులు పెద్ద ఎత్తున అద్దె బకాయి ఉన్నారని టీటీడీ ఎస్టెట్, రెవెన్యూ విభాగం అంటోంది. అయితే బకాయిల వసూళ్ల మాటేమో కాని హోటల్ లీజు గడువు ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు దాన్ని నిర్వహించిన వారు మాత్రం తమకే తిరిగి హోటల్ లీజు రెన్యూవల్ చేయాలంటున్నారు. టీటీడీలో ఓ ఉద్యోగి కుటుంబంతో పాటు గతంలో తిరుపతిలో చక్రం తిప్పిన ఓ నాయకుడు అనుచరుడు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ మంచి రద్దీగా ఉన్న ప్రదేశంలో ఉండటంతో ఆదాయం కూడా బాగానే వుందంట. దీంతో దీనిని వదలి వేయడానికి ఇష్టపడని నిర్వాహకులు ప్రతిసారి ఎవరో ఓకరి సాయంతో నెట్టుకొస్తున్నారు.

హోటల్ లీజు రద్దు చేయాలని కూటమి నేతల డిమాండ్

కూటమి అధికారంలో కి వచ్చిన వెంటనే టిడిపితో పాటు జనసేన నేతలు హోటల్ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్టేట్ విభాగంలోని అధికారులు అడ్డగోలుగా సహాకరించడంతో వారు ఇన్నిరోజులుగా వారు సారంగీ హోటల్ లీజుదారులుగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా తిరుపతిలోని అన్ని టీటీడీ హోటల్స్‌కు టెండర్స్ పిలిచారు..ఇందులో సారంగి హోటల్ కూడా ఉంది..అయితే నిర్వాహకులు హైకోర్టును అశ్రయిస్తే పాలకమండలి తీర్మానం ఫైనల్ అని ఉత్తర్వులు ఇచ్చింది.. పాలక మండలి సారంగి హోటల్ యాజమాన్యం కోరికను తిరస్కరించింది..అయితే 22వతేది పాలక మండలి తిరస్కరించింది వెంటనే నోటీసు ఇచ్చి వారిని ఖాళీ చేయించాల్సిన ఎస్టెట్ విభాగం తీరిగ్గా 24వతేది ఖాళీ చేయ్యండంటూ హోటల్ వద్దకు వెళితే ..వారు మరోసారి హోకోర్టు మూడు వారాల గడువు ఇచ్చిందని మరో ఉత్తర్వు చూపించారంట..మొత్తం మీదా ఎస్టెట్ అపీసర్ వైఖరే ఇందుకు కారణమని అంటున్నారు..

ప్రభుత్వ మారి కొత్త పాలకవర్గం వచ్చినా టీటీడీ ఎస్టేట్ విభాగం ప్రక్షాళన చేయకపోవడంతో.. గతంలో కొనసాగిన అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. వారికి తోడు డిప్యూటేషన్ పై వచ్చిన రెవెన్యూ అధికారి తిరుమల ఎస్టేట్ అధికారి గా ఉన్నారు.. అయన కూడా గత పాలకుల మాటలకు వంత పాడుతున్నారని అంటున్నారు.. తట్టల ఇష్యూతో పాటు ఓ దుకాణం విషయంలో ఎస్టేట్ విభాగంపై అనేక విమర్శలు వస్తున్నాయి.. టిటిడి చైర్మన్ పలుమార్లు తట్టల దందా పై ఎస్టేట్ అధికారులను హెచ్చరించినప్పటి ఫలితం శూన్యం.. మొత్తం మీద టిటిడి పాలక మండలి మాటలను మేము వినేది లేదన్నట్లు వ్యవహారిస్తూ అక్రమార్కులకు ఎస్టేట్ అధికారులు వంతపాడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.. పారదర్శకత విషయంలో కఠినంగా ఉంటామంటున్న టీటీడీ పాలకులు ఎస్టేట్ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×