Brahmamudi serial today Episode: మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాలను ఎటు తీసుకువెల్లాలో నిర్ణయిస్తాయి అంటారు. ఆరోజు నువ్వు ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు ఇలా అందరం బాధపడేవాళ్లం కాదు అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్లం అంటుంది ఇంద్రాదేవి. దీంతో రేవతి నా రాత అలా ఉంటే నేనేం చేయగలను నాన్నమ్మ అంటుంది. అప్పట్లో నువ్వు మీ అమ్మకు చెప్పకుండా అడుగు కూడా బయట పెట్టే దానివి కాదు అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగావే.. అంత ధైర్యం నీకెలా వచ్చింది అని ఇంద్రాదేవి అడగ్గానే.. అమ్మా నాన్నలకు చెప్పి వాళ్లను ఒప్పించి మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం నాన్నమ్మ. కానీ రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగింది అని రేవతి చెప్పగానే.. ఇంద్రాదేవి, కావ్య షాక్ అవుతారు.
ఏంటి రుద్రాణి సలహా ఇచ్చిందా..? అని ఇంద్రాదేవి అడగ్గానే.. అవును ఒక రోజు నేను ఈయన కలిసి ఉండటం రుద్రాణి అత్తయ్య చూసేసింది. అంటూ ఆ రోజు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది రేవతి. అంతా విన్నాక ఇంద్రాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. ఇదంతా ఆ దొంగముఖంది ఇచ్చిన సలహానా..? దాని మాటలు నమ్మి నువ్వు ఇంత వరకు తెచ్చుకున్నావా..? అసలు దాని మాటలు ఎలా నమ్ముకున్నావే అంటూ అడగ్గానే.. ఇప్పుడు ఆవిడను తిట్టుకుని ఏం లాభం నాన్నమ్మ.. నా జీవితం ఇలా ఉండాలని ముందే ఆ దేవుడు రాసి పెట్టేసి ఉంటాడు. దానికి రుద్రాణి అత్తయ్య మాట తోడైయింది అంతే అంటుంది రేవతి.
ఇంతలో కావ్య నేను అనుకున్నాను ఇంట్లో ఇంత దారుణం జరిగితే రుద్రాణి హస్తం లేకుండా ఉందా..? అని కానీ నా అనుమానమే నిజం అయింది అంటుంది కావ్య. రాజ్ కూడా కోపంగా ఆవిడ కనిపించడానికి అంత అందంగా ఉన్నా మనసులో ఇంత కన్నింగ్ దాచుకుందా..? నేను అస్సలు ఊహించలేదు అంటాడు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా.. జరిగింది అయితే మార్చలేము కదా తమ్ముడు అంటుంది రేవతి. దీంతో ఇంద్రాదేవి కోపంగా మీరు ఊరుకున్నా నేను ఊరుకోను దానికి సరైన బుద్ది చెబుతాను అంటుంది.
మరోవైపు రుద్రాణి రూంలో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తుంది. రాహుల్ వచ్చి పాటలు ఆపేస్తాడు. దీంతో రుద్రాణి రేయ్ ఏంట్రా సాంగ్స్ ఆపేశావు.. ప్లే చేయ్‌రా..? అంటుంది. మామ్ ఏంటి ప్లే చేసేది అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని రాహుల్ అడగ్గానే.. ఆనందం తట్టుకోలేక డాన్స్ చేస్తున్నానురా..? ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని బయటకు ఎక్స్‌ప్రెస్ చేస్తే అది డబుల్ అవుతుందంట కమాన్ నువ్వు కూడా చేయరా..? అనగానే.. మామ్ నీ హ్యపీనెస్‌ను నేను కూడా అర్థం చేసుకోగలను కానీ కొంచెం కంట్రోల్ చేసుకో ఫ్లీజ్ అంటాడు రాహుల్.. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలిరా..? అంటూ రుద్రాణి అడగ్గానే.. ఇంట్లో ఎవరైనా చూశారంటే ఈ గొడవ కావాలనే మనమే చేసినట్టు వాళ్లకు డౌటు వస్తుంది కదా అంటాడు రాహుల్. ఆనందంలో ఆ విషయమే మర్చిపోయానురా..? ఎనీవే నాకైతే ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉందిరా.? మొత్తానికి మనం అనుకన్నది అనుకున్నట్టు సాధించేశాం అంటుంది.
దీంతో రాహుల్ కూడా అవును మమ్మీ.. అపర్ణ ఆంటీ ఎక్కడ రేవతిని క్షమించేస్తుందోనని చాలా భయపడ్డాను.. కానీ ఆంటీ క్షమించలేదు.. అంటూ ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే.. ఇంద్రాదేవి వస్తుంది. వెంటనే మాట్లాడుకోవడం ఆపేసి సైలెంట్‌గా ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుంది రుద్రాణి. నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చాను రుద్రాణి అని ఇంద్రాదేవి చెప్పగానే ఎగ్జైంటింగ్ గా రుద్రాణి ఏంటమ్మా ఆ గిఫ్ట్ చెప్తే నేనే నీ దగ్గరకు వచ్చే దాన్న కదమ్మా అంటుంది. ఈ గిఫ్ట్ నేనే వచ్చి ఇచ్చేది రుద్రాణి అంటూ దగ్గరకు వెళ్లి చెంప పగులగొడుతుంది. దీంతో రుద్రాణి ఏంటమ్మా గిఫ్ట్ అని కొడుతున్నావు ఇప్పుడు నేను ఏం తప్పున చేశాను అని అడుగుతుంది. ఈ బహుమతి ఇప్పుడు తప్పు చేసినందుకు కాదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చేసినందుకు అని చెప్తుంది ఇంద్రాదేవి. ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు కొడతావేంటి..? అని రుద్రాణి అడగ్గానే.. అంటే నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందిలే అని చెప్పి వెళ్లిపోతుంది ఇంద్రాదేవి. దీంతో రాహుల్ ఇదేం కొత్త కాన్సెప్ట్ మామ్..గతంలో చేసిన తప్పులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాగే వచ్చి కొడుతుందా..? అని అడగ్గానే.. రుద్రాణి రాహుల్‌ను తిడుతుంది.
మరోవైపు కావ్య కోపంగా రాజ్ ను తిడుతుంది. నీ ప్లాన్ వల్లే ఇదంతా జరిగింది అంటుంది. దీంతో ఒక్క ప్లాన్ ఫెయిల్ అయిందని వెనకంజ వేయోద్దు.. మరోక ప్లాన్ చేద్దాం అని చెప్తాడు. ఏంటని కావ్య అడగ్గానే.. కూతురు ద్వారా ప్లాన్ వర్కవుట్ కాలేదు. కానీ మనవడి ద్వారా దగ్గర చేద్దాం అంటాడు. సరే ఈ ఒక్కసారి చేద్దాం అంటుంది కావ్య. తమ ప్లాన్‌లో భాగంగా కావ్య, ఇంద్రాదేవి వెళ్లి అపర్ణ గుడికి వెళ్లేలా రెచ్చగొడతారు. వాళ్లిద్దరి మాటలకు అపర్ణ గుడికి బయలుదేరుతుంది. వెంటనే రాజ్ కు ఫోన్ చేసి అపర్ణ గుడికి బయలుదేరిందని చెప్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రేవతి ఎమోషనల్ అవుతుంది. దీంతో రేవతిని జగదీష్ ఓదారుస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?