E-Paper
Advertisement

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏరులై పారనున్న మద్యం, తిరుపతికి బిగ్ రిలీఫ్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏరులై పారనున్న మద్యం, తిరుపతికి బిగ్ రిలీఫ్
Advertisement

Amaravati: మద్యం షాపుల విషయంలో దేశంలోని ఒక్కో రాష్ట్రం కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. టూరిజంపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన ఏపీ.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాపులు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయంలో తిరుపతికి మినహాయింపు ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. అన్నివిధాలుగా అభివృద్ధి చేసేలా ఫోకస్ చేసింది. ముఖ్యంగా టూరిజం విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు-మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతించింది. ఈ విషయంలో తిరుపతికి బిగ్ రిలీఫ్ దక్కింది.

కొత్త పాలసీని తీసుకొస్తూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఎయిర్‌పోర్టుల్లో 24 గంటలు బార్లు, మద్యం షాపులు నడవనున్నాయి. ఎయిర్‌పోర్ట్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ నిబంధనలు, లా అండ్ ఆర్డర్ లోబడి నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్లో అనుమతి ఇచ్చింది.

Advertisement

ఎయిర్‌పోర్టుల్లో మద్యం-బార్ల షాపులు..  తిరుపతికి బిగ్ రిలీఫ్

ఇక తిరుపతి ఎయిర్‌పోర్టులో మతపరమైన ప్రాధాన్యం కారణంగా బార్లు అనుమతించడం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధికి ఊతమిస్తుందని అధికారుల అంచనా. ఎయిర్‌పోర్టుల్లో టెర్మినల్‌ భవనం, ప్లాజాల్లో వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు ‌ సిఫారసు చేసినవారికి మాత్రమే లైసెన్స్‌లు మంజూరు చేయనుంది ఎక్సైజ్‌ శాఖ. బార్‌కు డిప్యూటీ కమిషనర్‌, షాపుకు ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా పేర్కొంది. ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే ఎయిర్‌పోర్టుల్లో రూ.25లక్షలు, అంతకంటే తక్కువ మంది ప్రయాణికులు వచ్చే విమానాశ్రయాలకు రూ.15లక్షలు ఉండనుంది.

ALSO READ: చిన్నారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రతీ నెలా రూ. 4 వేలు, ఇంకెందుకు ఆలస్యం 

మద్యం షాపులకు ఏడాదికి కోటి చొప్పున ఫీజు చెల్లించాలి. మూడేళ్లకోసారి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా పాలసీని సమీక్ష చేయనుంది. ఆధునిక ఎయిర్‌పోర్టులకు  ప్రయాణికులకు అన్ని సదుపాయాలు వస్తున్నాయని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి అదనపు ఆదాయం తెస్తుందని చెబుతున్నారు అధికారులు.

ఈ నిర్ణయం ద్వారా టూరిజం విభాగం జోరందుకోవచ్చని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు. విశాఖ-హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రెండు రాష్ట్రాల మధ్య పోటీని మరింత పెరగడం ఖాయమని అంటు్ననారు. విదేశీ ప్రయాణికులు, ఎన్‌ఆర్‌ఐలు మరింత సౌకర్యంగా ఉంటుందని టూరిజం ఏజెంట్లు చెబుతున్నారు. స్థానిక వ్యాపారులు, టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు.

Related News

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×