E-Paper
Advertisement

వై-ఫై నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి దొంగతనాలు… మస్ట్ వాచ్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్

వై-ఫై నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి దొంగతనాలు… మస్ట్ వాచ్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Hollywood Cyber Thriller : హాలీవుడ్ సినిమాల్లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్లు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి. అలా సైబర్ క్రైమ్, హ్యాకింగ్, లవ్ థ్రిల్లర్ కలిపిన ఉత్కంఠభరితమైన ఇంగ్షీషు చిత్రం ‘వార్‌డ్రైవర్’. 2026లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మూవీ సాధారణ హ్యాకింగ్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఒక యంగ్ హ్యాకర్ జీవితం ద్వారా లవ్, డేంజర్, ప్రతీకారం అనే అంశాలను అద్భుతంగా అల్లి, ప్రేక్షకులను టెన్షన్‌తో కట్టిపడేసేలా తెరకెక్కించారు. డేన్ డెహాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ 2026 చిత్రం సైబర్ ప్రపంచం డార్క్ సైడ్ ను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

టాలెంటెడ్, యంగ్ హ్యాకర్ కోల్ (డేన్ డెహాన్) మన హీరో అన్నామతా. అతనికి ఒక వింత అలవాటు ఉంటుంది. తన కారులోనే నగరంలో తిరుగుతూ వివిధ వ్యాపార సంస్థల వై-ఫై నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి, డిజిటల్ దొంగతనాలు చేస్తుంటాడు. దీనినే టెక్నికల్ భాషలో ‘వార్‌డ్రైవింగ్’ అంటారు. తాను సాధారణ ప్రజలను దోచుకోవడం లేదు, కేవలం బ్యాంకుల నుండే దొంగతనం చేస్తున్నాను అని, కాబట్టి ఎవరికీ నష్టం లేదని అతను భావిస్తాడు.

Advertisement

కానీ ఇలా చేస్తుండగా, ఒకరోజు ఆస్కార్ (మమౌదౌ అథియా) అనే బ్లాక్ మార్కెట్ సైబర్ క్రిమినల్ కంట్లో కోల్ పడతాడు. అతను కోల్‌ను బెదిరించి, ఒక మిలియన్ డాలర్ల భారీ సైబర్ దోపిడీ చేయమని ఒత్తిడి తెస్తాడు. ఆ దోపిడీ చేసే క్రమంలో కోల్‌ కు ఒక పెద్ద మాఫియా లాయర్ (జెఫ్రీ డోనోవన్) తన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడానికి సారా (సాషా కాలే) అనే అమాయక మహిళ బ్యాంక్ అకౌంట్‌ ను వాడుకుంటున్నాడనే నిజం తెలుస్తుంది.

ఆ దోపిడీ వల్ల సారా ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. తన వల్ల ఇరుక్కుపోయిన సారాను కాపాడటానికి, ఆ మాఫియా, సైబర్ క్రిమినల్స్ నుండి తనను తాను రక్షించుకోవడానికి కోల్ ఎలాంటి రిస్క్ తీసుకుంటాడు ? ఆ డబ్బును తిరిగి ఎలా అప్పగించాడు ? అనేది ఈ నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని చూసి తెలుసుకోవలసిన విషయం. ఈ సినిమాలో హై-స్పీడ్ కార్ చేజ్‌లు, సైబర్ హ్యాకింగ్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా, ఉత్కంఠభరితమైన ట్విస్టులు అన్నీ ఉంటాయి. ‘వార్‌డ్రైవర్’ JioHotstarలో అందుబాటులో ఉంది. భారతదేశంలో జూన్ 26 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెరికాలో 2026 మార్చి 20న థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. ఈ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×