BigTV English

Road Accidents in AP: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!

Road Accidents in AP: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!

Andhra Pradesh Road Accidents two killed, 12 injured: ఏపీలో రహదారాలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో అర్ధరాత్రి వేరువేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కడప, అనంతంపురం జిల్లాల్లో రోడ్లు రక్తమోడాయి. గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించాలంటేనే ఆందోళన చెందుతున్నారు.


కడప జిల్లాలోని సిద్దవటం మండలం మాధవరం ఎస్కే నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప – చెన్నై జాతీయ రహదారిపై లారీ, ఆటో ఢీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయ పడిన ఆటో డ్రైవర్, చిన్న పాపను హుటాహుటిన రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న సిద్ధవటం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే కడపకు వెళ్తున్న ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అనంతపురం జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూను నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు జాతీయరాహదారిపై ప్రమాదానికి గురైంది. జిల్లాలోని గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో తెలంగాణకు చెందిన బస్సు అర్థరాత్రి 2 గంటలకు ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, ట్యాంకర్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే హైవే పోలీసులు, గార్లదిన్నె పోలీసుల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్ నగరానికి పంపేలా సహాయక చర్యలు తీసుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×