E-Paper
Advertisement

LPG Delivery Boy Crime: మైనర్ బాలికపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఘాతుకం.. అయిదేళ్ల తరువాత ఏం జరిగిందంటే?..

LPG Delivery Boy Crime: మైనర్ బాలికపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఘాతుకం.. అయిదేళ్ల తరువాత ఏం జరిగిందంటే?..
Advertisement

LPG Delivery Boy Crime| అయిదేళ్ల క్రితం ఒక గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో విచారణ అయిదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. ఇటీవల నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10000 జరిమానా కూడా విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నూర్ మొహమ్మద్ ఖాన్ అనే 26 ఏళ్ల యువకుడు గ్యాస్ సిలిండ్ డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని పొరుగింట్లో నివసించే ఒక 15 ఏళ్ల బాలిక తరుచూ అతని ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో మే 23, 2019న ఆ మైనర్ బాలిక.. నూర్ మొహమ్మద్ ఇంటికి వెళ్లింది.

Advertisement

Also Read: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కేవలం నూర్ మొమ్మద్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇదే అదునుగా చూసి నూర్ మొహమ్మద్ ఆ అమ్మాయిని బలవంతంగా తన గదికి తీసుకొని వెళ్లి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో బాలిక నోటిని గట్టిగా మూసేయడంతో ఆమె గట్టిగా అరవలేకపోయింది. అయితే ఘటన తరువాత ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వాళ్లు వెంటనే పోలీస్ స్టేషన్ కు తమ కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

పోలీసులు నిందితుడు నూర్ మొహమ్మద్ పై అత్యాచారం కేసు, పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేయగా.. అతను పరారయ్యాడు. ఆ తరువాత పోలీసులు బృందాలు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. ఆ తరువాత కోర్టులో కేసు విచారణ 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.10000 జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

ఇలాంటిదే మరోకేసు ఠాణె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో కూడా జరిగింది. ఈ రెండో కేసులో పదో తరగతి చదువుతున్న ఒక 16 ఏళ్ల అమ్మాయిపై నిందితుడు 2019 జూలై 13న కిడ్నాప్ చేసి ఆ తరువాత అమెపై అత్యాచారం చేశాడు. నిందితుడు దీపక్, బాధితురాలు.. ఒకే ప్రాంతంలో నివసించే వారు. ఈ కేసుని విచారణ చేసిన కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.8000 జరిమానా విధించింది. దీంతో పాటు ప్రభుత్వం తరపున బాధితురాలికి మనోధైర్యం పథకం కింద రూ.3 నుంచి రూ.10 లక్షలు అందుతుంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×