BigTV English

AP Cyclone : ముంచుకొస్తున్న మరో తుపాన్.. భయాందోళనలో ఏపీ ప్రజలు..

AP Cyclone : ముంచుకొస్తున్న మరో తుపాన్.. భయాందోళనలో ఏపీ ప్రజలు..

AP Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఈ నెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 18న అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం భారీ తుపాన్‌గా మారి శ్రీలంక, తమిళనాడుతో పాటు ఏపీ వైపు కూడా పయనించే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావంతో ఏపీలో ఈ నెల 21 నుంచి 27 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణశాఖ అధికారులు.


ఇప్పటికే మిగ్‌‌జాం తుపాన్‌తో అతలాకుతలమైన ఏపీకి.. మరో తుఫాన్‌ ముపు పొంచి ఉండటంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మిగ్‌‌జాం మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాన్‌ ఎఫెక్ట్‌ అనే వార్త రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. మిగ్‌‌జాం తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో చేతికొచ్చిన పంట నీటమునిగి రైతులు తీవ్లరంగా నష్ట పోయారు. ఇప్పుడు మరో తుపాన్ ముంచుకొస్తుందనే వార్త అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తుంది.

ఏపీకి మరో తుపాన్ ముపు పొంచివుండటంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు.


Related News

Ambati Rambabu: అంబటి చిక్కు ప్రశ్న.. మంత్రి లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో?

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

Big Stories

×