E-Paper
Advertisement

Kidnap Case : ఆ వ్యాపారులే టార్గెట్.. విశాఖలో మరోసారి కిడ్నాప్ కలకలం..

Kidnap Case : ఆ వ్యాపారులే టార్గెట్.. విశాఖలో మరోసారి కిడ్నాప్ కలకలం..
Advertisement

Kidnap Case : విశాఖలో వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. కొన్నిరోజుల క్రితం వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఓ ఆడిటర్ కిడ్నాప్ నకు గురయ్యారు. ఈ వ్యవహారం సుఖాంతమైన పెను రాజకీయ దుమారాన్నే రేపింది. ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఆ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి విశాఖలో మరో కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్‌, లోవ లక్ష్మి దంపతులు 4 నెలల క్రితం నగరానికి వచ్చారు.నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆ దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.60 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారని బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ కిడ్నాప్‌ వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించారు.

Advertisement

కాకినాడ జిల్లా అన్నవరం మండలం కత్తిపూడి వద్ద ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీనివాస్‌, అతడి భార్య లక్ష్మి సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

మరోవైపు కిడ్నాప్ నకు గురైన శ్రీనివాస్‌పై గతంలో విజయవాడ పడమటలో కేసు ఉంది. చీటింగ్‌ కేసులో జూన్‌ 2021లో శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3 కోట్లు కాజేశారని అప్పట్లో కేసు నమోదైంది. కిడ్నాప్‌ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related News

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

Big Stories

Advertisement
×