BigTV English

Shock to Ysrcp: వైసీపీ ప్లాన్ బూమరాంగ్.. నవ్వుతూ కనిపించిన సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్

Shock to Ysrcp: వైసీపీ ప్లాన్ బూమరాంగ్.. నవ్వుతూ కనిపించిన సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్

Shock to Ysrcp: ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ రూటు మార్చిందా? పాత అస్త్రాలను ప్రత్యర్థులపై ఎక్కుపెట్టిందా? ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆయా అస్త్రాలు పని చేయడం లేదా? ఫ్యాన్ పార్టీ వేసిన స్కెచ్ లు తరచు ఎందుకు బూమరాంగ్ అవుతున్నాయి? కేవలం కూటమి విడపోతేనే వైసీపీ లబ్ది పొందుతుందని భావిస్తోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.


వైసీపీ వేసిన ప్లానేంటి?

విభజించు.. పాలించు.. బ్రిటీషర్ల కాన్సెప్ట్‌ని ఎత్తుకుంది వైసీపీ. గత టీడీపీ హయాంలో ఇదే చేసింది.. సక్సెస్ అయ్యింది. 2019-24 మధ్యకాలంలో ఏపీని పాలించింది. ఇప్పుడూ అదే స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. సమయం, సందర్భం, పరిస్థితులను బట్టి అస్త్రాలు ప్రత్యర్థులపైకి విరుసుతోంది. కేడర్ ఏమాత్రం ఆవేశాలకు లోను కాకుండా జాగ్రత్త పడుతోంది కూటమి. ఫలితంగా వైసీపీ అస్త్రాలు బూమరాంగ్ అవుతున్నాయి.


తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం రాత్రి మ్యూజికల్‌ నైట్ నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పద్మభూషణ్ బాలకృష్ణ, ఐటీ మంత్రి లోకేష్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు దేవాలయాలను సందర్శించకున్న డిప్యూటీ సీఎం పవన కల్యాణ్.. గతరాత్రి జరిగిన ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఈవెంట్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మల్యే బాలకృష్ణ క్లోజ్‌‌గా ఉన్నారు. ఆయా నేతలు చాలా విషయాలు చర్చించుకున్నారు. ఏయే అంశాలు చర్చించుకున్నారనే విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. కూటమి నేతలను అలా చూసి చాలా మంది షాకయ్యారు. వీరి మధ్య విభేదాలకు ఎలా ఫుల్‌స్టాప్ పడిందని చర్చించుకోవడం ఓ సెక్షనాఫ్ వర్గంలో మొదలైంది. ఇంతకీ టీడీపీ-జనసేనకు మధ్య విభేదాలేంటని అనుకుంటున్నారా? అక్కడకే వచ్చేద్దాం.

ALSO READ: టికెట్ కొనని పవన్.. భువనమ్మకు పెద్ద కానుకే ఇచ్చారు

షాకైన వైసీపీ, ఎందుకు?

గడిచిన నాలుగురోజులుగా వైసీపీ అధికారిక గెజిట్‌లో వరుసగా కథనాలు వచ్చాయి. వాటి సారాంశం ఏంటంటే.. సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయన్నది అందులోకి కీలకమైన పాయింట్. దీని చుట్టూ గడిచిన నాలుగు రోజులుగా రకరకాల కథనాలను వండి వార్చింది. కూటమి నుంచి ఎలాంటి రియాక్ష్ లేకపోవడతో నిజమేనని చాలామంది నమ్మారు.

అనారోగ్యం కారణాలతో గతవారం నిర్వహించిన సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. దీనిపై వైసీపీ అధికారిక గెజిట్‌లో ఓ కథనం వచ్చింది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని రాసుకొచ్చింది.  దీని తర్వాత రెండు రోజులకు అమరావతిలో మంత్రులు-కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం జరిగింది. ప్రభుత్వ పరంగా మంత్రులు, అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకాలేదు. జనసేన అధినేత ఆరోగ్యంగానే ఉన్నారని, రేపటి నుంచి దక్షిణాదిలో దేవాలయాలను సందర్శించనున్నారని రాసుకొచ్చింది వైసీపీ అధికార గెజిట్. సమావేశానికి సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా డిప్యూటీ సీఎం లిప్ట్ చేయలేదని ప్రస్తావించింది. సమావేశానికి దూరంగా ఉండాలనే ఆలోచనతో దక్షిణాది టూర్ కి పవన్ ప్లాన్ చేసినట్టు ప్రస్తావించింది.

ఈ విధంగా రకరకాలుగా కథనాలు వండి వార్చింది. ఆయా కథనాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. చివరకు శనివారం రాత్రి ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హజరయ్యారు. సీఎం చంద్రబాబు, ఆయన నేరుగా నడుచుకుంటూ మాట్లాడుకున్నారు. ప్రముఖుల ప్రసంగంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్ క్లోజ్‌గా మాట్లాడుకోవడం కనిపించింది. మొత్తానికి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ముఖ్యనేతలు ఈ విధంగా తిప్పుకొట్టారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి స్కెచ్ లు వైసీపీ ఇంకెన్ని వేస్తుందో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×