Gundeninda GudiGantalu Today episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ పనిచేస్తున్న షో రూమ్ అనగానే ప్రభావతికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. మనోజ్ కు ఈ విషయం చెప్పాలని ప్రభావతి శత విధాల ప్రయత్నిస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మా అమ్మ మీద అలిగాను ఫోన్ లిఫ్ట్ చెయ్యను అని అంటాడు. ఇక మౌనిక జాబ్ కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి ఏమైందమ్మా మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా అని అడుగుతుంది. లేదు అత్తయ్య జాబ్ కి రమ్మని అంటున్నారు. పెళ్లికి ముందైతే ఆయన చేసుకోవచ్చని అన్నాడు అత్తయ్య ఇప్పుడైతే మరియు ఒప్పుకుంటాడో లేదో అనగానే ఇక సువర్ణ కూడా వాడు ఇప్పుడు ఒప్పుకుంటాడు అంటావా అనేసి అంటుంది అప్పుడే. సంజు అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరి ముచ్చట్లు పెట్టుకున్నారు అనగానే సువర్ణ జాబ్ కి వెళ్లాలనుకుంటుంది రా అనగానే అవసరం లేదు. ఇంట్లో పనిమనిషి మాన్పిచ్చి అన్ని పనులు చేయించు నేను వచ్చిన వాళ్ళు ఎలాగో పనిమనిషి అనుకున్నారని అంటాడు. నేను జాబ్ చేస్తానంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు చేయొచ్చు అని అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అంటే. ఇప్పుడు నిన్ను ట్రాప్ చేయడానికి నేను ఏదో అలా వాగేసాను. ఇప్పుడు అవసరం లేదు మొగుడు ఖాళీగా ఉంటే నువ్వు జాబ్ చేయడానికి వెళుతున్నావంటే ఆఫీసులో నీకు నచ్చిన వాడు ఎవడో ఉన్నాడా అని అనుమానపడతాడు.. నీకు నచ్చిన వాడెవడో ఉన్నాడు కదా అందుకే ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నావా అలాంటివేమి అవసరం లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటాడు దానితో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రవి, శృతిని ఎలాగోలా మ్యానేజ్ చేస్తాడు మనోజ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు తన చెల్లెలు మౌనికకు బాలు ఫోన్ చేస్తాడు. కానీ సంజు పక్కనే ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ బాలుకు అసలు విషయం తెలియక కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. బాలు నుండి ఫోన్ వస్తే.. మాట్లాడవద్దని, తాను ప్రతినెల కాల్ డేటా చెక్ చేస్తానని, బాలు నుండి మిస్డ్ కాల్స్ మాత్రమే ఉండాలని కాదని ఫోన్ మాట్లాడితే బాగోదంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో మౌనిక తన పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది. తన ఆవేదనను ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తానే మనోవేదనకు గురవుతుంది. మరోవైపు బాలు తన చెల్లెలు మౌనికతో మాట్లాడాలని, ఈ ఈ విషయంపై మాట్లాడడానికి సంజు దగ్గరికి వెళ్లాలని భావిస్తాడు. మీనాకు చెప్పగానే షాక్ అవుతుంది. మీ మీద కోపంతో ఆ దుర్మార్గుడు మౌనికను ఏదైనా చేస్తాడేమో అని టెన్షన్ పడుతుంది. ఇప్పుడు అంత కష్టపడి చదివి తెచ్చుకున్న జాబ్ ని వదిలేసిందంటే నాకు ఏదో అనుమానంగా ఉంది నేను ఎలాగైనా మౌనికని చూడాలి.. ఒకసారి మౌనిక దగ్గరికి వెళ్లి దూరం నుంచి అయినా చూసేసి వస్తాను అని మీనాతో అంటాడు.. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మీ చెల్లిని చూడడం ఏమో కానీ ఆ రాక్షసుడు మిమ్మల్ని చూసి ఎంత గొడవ చేస్తారో అది ఆలోచించడం లేదు అని మీనా అరుస్తుంది..
సత్యం మాత్రం బాలుని వెళ్లడానికి వీలు లేదని చెప్తాడు. మీకు ఒక్కరికైనా మౌనికను చూడాలని ఉందా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఎలా ఉంది ఇంతకీ ఆ మనిషి ఎలా చూసుకుంటున్నాడు ఇలాంటివన్నీ అడిగే పనే లేదు కదా అనేసి అందరినీ పేరుపేరునా తిట్టిపోస్తాడు. మరో వైపు సడన్గా మౌనిక పుట్టింటికి రావడంతో.. షాక్ అవుతారు. ఈ సమయంలో అత్తవారింట్లో ఎలా ఉందని, సంజు ఎలా చూసుకుంటున్నాడని అడుగుతారు. అసలు విషయం చెప్పకుండా మౌనిక దాచిపెడుతుంది. తనని మహాలక్ష్మిలా చేసుకుంటున్నారని అబద్దం చెబుతుంది. ఈ సమయంలో బాలు తన చెల్లెలితో మాట్లాడుతూ.. జాబ్ ఎందుకు మానేశావని అడుగుతాడు. సత్యం కూడా ఈ విషయంపై మాట్లాడుతూ పెళ్లికి ముందు జాబ్ చేసుకోవచ్చని చెప్పారు కదా ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. మరోవైపు మృతి మాట్లాడుతూ సంజు సైకో లాగా ప్రవర్తించడం లేదు కదా అని డైరెక్ట్ గా అడిగి చేస్తుంది. ఇలా వరుసగా ఒకరి తర్వాత మౌనిక అత్తగారి ఇంటి గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే మౌనిక తన అత్తింటి బాధలు పుట్టింట్లో చెప్పుకుంటుందా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..