Lady Aghori at Dilsukhnagar: మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఒకరి అంగాన్ని త్వరలోనే కోయబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరీ మాత. అది కూడా అందరి ముందే ఈ కార్యం జరుగుతుందని అఘోరీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అఘోరి మాత గురువారం హల్చల్ చేశారు. అదేనండీ తెలంగాణకు చెందిన అఘోరీ మాత, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకెక్కారు. అంతేకాదు తెలంగాణ నుండి వెళ్లిన అఘోరీ, తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభమైన సమయం నుండి ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత దర్శిస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి వద్ద వస్త్రధారణ పాటించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ కు యత్నించారు అఘోరీ. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు నివారించి, సాయంత్రం దర్శనం చేయించారు. మరల శుక్రవారం తెల్లవారుజామున మాత కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదానికి కారణం పోలీసులేనంటూ అఘోరీ మాత ఆరోపించారు.
అనంతరం కాలినడక సాగించి, యాగంటి క్షేత్రాన్ని దర్శించారు. అలాగే అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో అఘోరి పూజలు నిర్వహించారు. ఇక ఏపీ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చిన అఘోరీ మాత శంషాబాద్ లో గల హనుమాన్ దేవాలయంను సందర్శించారు. ఈ ఆలయంలో నవగ్రహ విగ్రహాలను ఇటీవలే అగంతకులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఆ ఆలయంతో పాటు సిద్ధాంతి కట్టమైసమ్మ దేవాలయం, జూకల్ సౌడమ్మ దేవాలయాన్ని అఘోరి సందర్శించి, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, గో హత్యలు, మహిళలపై అత్యాచారాలు సైతం ఎక్కువయ్యాయని సీరియస్ అయ్యారు. అయితే అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎవరైనా తనను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అఘోరి కామెంట్స్ చేశారు.
గురువారం మాత్రం అఘోరీ మాత చేసిన కామెంట్స్ ఓ పెను సంచలనంగా చెప్పవచ్చు. దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురిలోని మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి వచ్చిన అఘోరి మీడియాతో మాట్లాడుతూ.. ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చినట్లు తెలిపారు. దేవాలయాలపై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్పణ చేసుకుంటానని మరోమారు అఘోరీ పునరుద్ఘాటించారు.
మహిళలపై దాడికి పాల్పడ్డ ఒక వ్యక్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కోయబోతున్నట్లు అఘోరి సంచలన కామెంట్స్ చేయడంతో స్థానికులు నివ్వెర పోయారు. హిందువులు ఏకం కావట్లేదని, ప్రతి ఒక్కరి హిస్టరీ తన వద్ద ఉందని అఘోరీ అన్నారు. అఘోరీ చేసిన ఈ కామెంట్స్ పై పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
దిల్‌సుఖ్‌నగర్‌లో అఘోరి హల్చల్…
చైతన్యపురిలోని మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి వచ్చిన అఘోరి.
ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చానని వెల్లడి.
ఒక వ్యక్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానన్న అఘోరి.… pic.twitter.com/LtOqZzujL3— ChotaNews (@ChotaNewsTelugu) November 14, 2024