E-Paper
Advertisement

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
Advertisement

BC Reservations: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల ప్రక్రియపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉందో స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు..

Advertisement

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు దక్కాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఈ విషయంలో న్యాయబద్ధంగా ముందుకెళ్లేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసి తీవ్ర అన్యాయం చేసిందని, ఆ బకాయిలన్నింటినీ భర్తీ చేస్తూ త్వరలోనే 123 మున్సిపాలిటీలకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

24 గంటల్లోనే అనుమతులు

Advertisement

గత ఐదేళ్లలో రాష్ట్రంలో భవన నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని మంత్రి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. కేవలం 24 గంటల వ్యవధిలోనే లేఅవుట్లు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు జారీ చేసేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

2028 నాటికి అమరావతి పూర్తి

రాజధాని అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2028 నాటికి అమరావతి నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణ నాణ్యత పరిశీలనను ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక బృందానికి అప్పగించామన్నారు. మరోవైపు, రాబోయే గోదావరి మహా పుష్కరాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకోసం రూ.2,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Also Read: మల్లేష్.. ఆర్మీ వెపన్స్ ఎందుకు చోరీ చేశాడంటే.. సీపీ సుమతి సంచలన నిజాలు!

Tags

Related News

శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిల‌ర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు, నైట్ విజన్ కెమెరాలతో గాలింపు..

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?

నాడు జగన్, నేడు చంద్రబాబు.. బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల!

Big Stories

Advertisement
×