BigTV English

Meeting on AP Mega DSC: కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి ఆమోదం..!

Meeting on AP Mega DSC: కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి ఆమోదం..!
Advertisement

AP Cabinet Meeting Key Points: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరగ్గా.. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 10వ తేదీ లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కేబినెట్ ముందుకు డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ రాగా.. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పెన్షన్ల పెంపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు నాయుడు ఐదు హామీలపై చేసిన సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై కేబినెట్ విడివిడిగా చర్చింది ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునర్నిర్వహణ, నైపుణ్య గణన హామీలపై చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు.


Also Read: Chandrababu Emotional Comments: మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: సీఎం చంద్రబాబు భావోద్వేగం

పెన్షన్ల పెంపు స్కీమ్ ఏప్రిల్ నుంచే అమలవ్వనుండగా.. పెన్షన్ దారులంతా జులై 1న రూ.7000 పెన్షన్ ను అందుకోనున్నారు. ఇక మెగా డీఎస్సీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి డీఎస్సీ నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×