BigTV English

Bade Miyan – Chote Miyan: ఒక్క సినిమాతో కోట్లలో నష్టం.. ఆఫీస్ అమ్ముకున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

Bade Miyan – Chote Miyan: ఒక్క సినిమాతో కోట్లలో నష్టం.. ఆఫీస్ అమ్ముకున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

Producer Vashu Bhagnani Sold His Office Bade Miyan Chote Miyan Movie Loss: కొన్ని సినిమాలు నిర్మాతలపై లాభాల పంట కురిపిస్తే.. మరికొన్ని సినిమాలు వాళ్లను తేరుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్ నిర్మాతకు ఎదురైంది. అతడు మరెవరో కాదు నిర్మాత వశు భగ్నానీ. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ఒక సినిమాతో కోట్లలో నష్టాల్లో కూరుకుపోయాడు. దీని కారణంగానే అతడు తన ఆఫీస్‌ను కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


బాలీవుడ్‌లో ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సినిమా ‘బడే మియా చోటో మియా’. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలతోనే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అనంతరం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన డైరెక్టర్ అబ్బాస్ జాఫర్.. ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్‌గా తెరకెక్కించడంతో సినీ అభిమానులు రిజక్ట్ చేశారు. దీని కారణంగా నిర్మాతకు గట్టి దెబ్బే పడింది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కేవలం రూ.90 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించిన వశు భగ్నానీకి రూ.250 కోట్ల నష్టం వాటిళ్లింది.


Also Read: ఏడేళ్ల ప్రేమబంధం.. పెళ్లిబంధంతో ఒక్కటైంది.. సింపుల్‌గా నటి సోనాక్షి సిన్హా పెళ్లి..

అదీగాక అతడు నిర్మించిన గత సినిమాలు కూడా బాక్సాఫీసు భారీ ఫ్లాపుగా నిలవడంతో మరిన్ని కష్టాలు నష్టాలుగా మారాయి. దీని కారణంగానే రూ.250 కోట్ల నష్టాలను పూడ్చుకోవడం కోసం అతడు ముంబైలోని తన ఏడు అంతస్తుల ఆఫీసును అమ్మేశాడట. అంతేకాకుండా తన దగ్గర వర్క్ చేసే దాదాపు 80 శాతం సిబ్బందిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించాడు. అలాగే ఇందులో నటించిన అక్షయ్, టైగర్, మానుషి, అలయా ఎఫ్ వంటి నటీ నటులకు కూడా పూర్తి పారితోషికం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా నిర్మాత వశు భగ్నానీకి ఈ మూవీ గట్టి దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×