Chandrababu on YCP: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. రైతులకు ధాన్యం కొనుగోళ్ల పాత బకాయిల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు 50వ CRDA సమావేశం నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాజధానికి మలివిడతలో 34, 964 ఎకరాల భూసేకరణకు ఆమోదం తెలిపింది. 13 గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు స్పోర్ట్స్ అకాడమీకి భూముల కేటాయింపుపై చర్చించారు. ఏపీ జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఇటు ఏపీ జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు ఒకే చెప్పింది మంత్రివర్గం. ఏపీ మోటార్ వెహికిల్ బిల్లులో పలు చట్టసవరణలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలు, కార్మిక బిల్లులో పలు చట్ట సవరణలు చేసే అంశంపై చర్చించారు. అమరావతి పరిధిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అమరావతి పరిధిలో భూమిలేని 1,575 పేద కుటంబాలకు పింఛన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న పింఛన్ కొనసాగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
నిధులు రాకుండా తెర వెనక అడ్డుకోవడం..ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం వైసీపీ అలవాటుగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇటు మామిడి రైతుల విషయంలోనూ వైసీపీది తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
Also Read: నెల్లూరు దాడికి, జగన్ చిత్తూరు పర్యటనకు సంబంధం ఉందా? ఇంకా భ్రమల్లోనే జగన్..
మరోవైపు ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు మెయిళ్లు పెట్టడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు ఈ-మెయిళ్లు పెట్టారని తెలిపారు. వైకాపా కుట్రలపై విచారణ చేయిస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో సీఎం నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. మెయిల్స్ చేసింది ఎవరూ…ఎవరు చేయించారు…ఎందుకు చేశారన్న కోణంలో దర్యాప్తు ఉండనున్నట్లు తెలుస్తోంది.