BigTV English

CM Chandrababu: మీ సినిమాలో ఈ సీన్స్ ఉన్నాయా.. పవన్ తో సీఎం చంద్రబాబు

CM Chandrababu: మీ సినిమాలో ఈ సీన్స్ ఉన్నాయా.. పవన్ తో సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్నను సంధించారు. నీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఒక్కసారిగా.. పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి సీన్స్ మీ సినిమాలో ఉన్నాయా అంటూ.. చంద్రబాబు అనగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ తనదైన రీతిలో స్పందించారు.


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడ్డ సమావేశం.. మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. నీటి ప్రాజెక్టులపై మాట్లాడే సందర్భంగా పవన్ ను ఉద్దేశించి చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. అంతటితో ఆగక పవన్ కూడా నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పడం విశేషం.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామన్నారు. అనుక్షణం మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పని చేస్తామని, వచ్చీ రాగానే పెన్షన్ రూ.1000 పెంచామని చెప్పారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్ లో భాగంగా, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు.


48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నట్లు, ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. కోటి మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షలమందికి గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. సమైక్యాంధ్రలో దీపం పథకం తెచ్చానని, ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా వంటగ్యాస్ ఇస్తున్నామన్నారు. డీఎస్సీ ఇప్పటికే ప్రకటించినట్లు, త్వరలోనే 16,354 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పోస్టింగులు ఇచ్చాకే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభిస్తామని తెలిపారు.

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ప్రకాశం జిల్లా జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రెండేళ్ల కాలం పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నీటి సమస్య తీర్చడానికి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ లను వేసి నిధులను కాజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అంటూ చంద్రబాబు అన్నారు. సినిమా సెట్టింగ్ లతో ఆదాయాన్ని దండుకున్నారని, అలాంటి సినిమా సెట్టింగ్‌లను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలంటూ చంద్రబాబు సూచించడం విశేషం. మీ సినిమాలలో వైసీపీ వేసిన సెట్టింగ్ లను ఉపయోగించుకోవచ్చని చంద్రబాబు సలహా ఇచ్చారు.

Also Read: YS Sharmila on TDP: 50 లక్షల మంది ఎదురు చూపుల్లో.. ఆ స్కీమ్ సంగతేంటి?

ఇక జగన్ గురించి మాట్లాడుతూ.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అన్న ఎమ్మెల్యేని చూడటం 40 ఏళ్లలో ఇదే మొదటి సారన్నారు. ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారని, దేశంలో ఇలాంటి విషయాలు ఎక్కడా జరగలేదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. మేము కాదని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఎలా పడితే అలా ఇస్తే ప్రజాస్వామ్యం ఎలా ఒప్పుకుంటుంది ? ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు మరోమారు సీఎం పునరుద్ఘాటించారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×