BigTV English

AP CM Chandrababu: ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా?

AP CM Chandrababu: ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా?

AP CM Chandrababu Naidu meets NITI Aayog in Delhi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.


ఢిల్లీలో శనివారం జరగనున్న నీతి అయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను నీతి అయోగ్ ముందు ఉంచనున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయాలను సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించనున్నారు.

నీతి అయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు తిరిగి విజయవాడకు రానున్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి అయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదు.


Also Read: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

జూలై 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2024 లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×