BigTV English

AP CM: రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లలాంటివి: ఏపీ సీఎం

AP CM: రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లలాంటివి: ఏపీ సీఎం

Ap Cm Chandrababu Naidu Speech At NTR Bhavan In Hyderabad: ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇక ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చారు.


అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివని చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తల్లో హుశారుని పెంచుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నెనెప్పుడు చూడలేదు. ఇప్పుడు టీడీపీ సునామీతో అందరూ కొట్టుకుపోయారు. విర్రవీగితే అందరికి ఇదే గతిపడుతుందని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని తమ మంత్రివర్గానికి సైతం సూచించారు.

Also Read: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..


ఇక టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు సంక్షేమానికి నాంది పలికిన నాయకుడని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఆత్మీయులను కలిసి వారికి అభినందనలను తెలియజేయడానికి వచ్చానని, తనపై కార్యకర్తలు కృషిచేశారని తెలిపారు. తెలంగాణ టీడీపీ నాయకులను ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆంధ్రా ప్రాంతాలు రెండు కూడా తనకు రెండు కళ్లలాంటివి అని, తెలంగాణ గడ్డపైనా టీడీపీ పార్టీ మళ్లీ పునర్వైభవం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం వైసీపీ పార్టీ తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని, లేని పోనీ ఆరోపణలు చేసి నన్ను జైళ్లో పెట్టించారని, ఆ టైమ్‌లో గచ్చిబౌళి నుంచి నాపై మీరు చూపించిన ప్రేమను నేనెప్పటికి మర్చిపోనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలను అమలు చేశారని, అలాంటివారు తెలుగుగడ్డపై పుట్టడం తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు.

Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×